సమస్యలు పరిష్కరించాలని హమాలీలు కలెక్టర్‌ వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12  స్వంత గోదాముల నిర్మాణం, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు వై.ఓమయ్య మాట్లాడుతూ జిల్లాలో స్వంత గోదాముల నిర్మాణం కోసం గత 5 సంవత్సరాలుగా డబ్బులు మంజూరై సిద్ధంగా ఉన్నా ఇప్పటి వరకు ఎక్కడా నిర్మాణం చేయలేదని, ఇప్పటికే కొన్ని మండాలల్లో స్థలాలను రెవెన్యూ అధికారులకు చూపించినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఒప్పందం ప్రకారం దసరాకు ఇస్తామన్న యూనిఫాంలు ఇవ్వాలని, గుర్తింపు కార్మికులివ్వాలని డిమాండ్‌ చేశారు. గోదాముల్లో స్వీపర్లను నియమించాలని, అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, జనశ్రీ బీమా ఇన్స్‌రెన్స్‌ కార్డులు అందరికీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహబూబ్‌, కోశాధికారి భాజన్న తదితరులు పాల్గొన్నారు.