సమస్యల పరిష్కారం కోసం గ్రామానికో పోలీస్‌ : ఎస్పీ రవీందర్‌

బోయినిపల్లి, జూలై 5 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించినట్లు జిల్లా ఎస్పీ రవీందర్‌ తెలిపారు. గురు వారం ఆయన బోయినిపెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసిప్షన్‌ సెంటర్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు, ఫిర్యాదు దారుడు దరఖాస్తులు చేసుకుంటే విధిగా రశీదు ఇవ్వాలని సూచిం చారు. జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, ప్రజా సమస్యలు, కుటుంబ సభ్యుల సమస్యలను ఫ్యామి లీ కౌన్సిలింగ్‌ ద్వారా 65 కేసులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ రక్షక దళాల ద్వారా నేరాల సంఖ్య తగ్గించినట్లు, దొంగతనాలు జరుగకుండా గ్రామాల్లో ఏర్పాటుచేసిన గ్రామ రక్షక దళాలు అనుక్షణం అప్రమత్తంగా వుండి, అనుమానం కలిగిన వ్యక్తులు గ్రామాల్లో ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. తూర్పు డివిజన్‌లో సమస్యాత్మక ప్రాం తాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూంబింగ్‌లు నిర్వహి స్తున్నామని తెలి పారు. మండలంలోని పలు గ్రామాల్లో కొందరు మద్యదళారులు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతు న్నారని, ఇప్ప టికైనా వారు పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చ రించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఓయస్డీ జానకి ధరావత్‌, వేములవాడ రూరల్‌ సిఐ జితేందర్‌రెడ్డి, ఎసై శ్రీలతలు వున్నారు.