*సిరిసిల్ల ప్రగతి లో మరో ముందడుగు అర్బన్ పార్క్.
చివరిదశకు చేరుకున్న పనులు
ఆహ్లాదకేంద్రంగా రిజర్వుడ్ అటవీ ప్రాంతం*
– దీపావళి నాటికీ అందుబాటులోకి రానున్న అర్బన్ పార్క్
– యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 23.(జనం సాక్షి) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మార్గదర్శనంలో సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల అటవీ రేంజ్ పరిధిలో పోతిరెడ్డిపల్లె రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ అత్యద్భుత అర్బన్ పార్క్ ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటుంది.
ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ సూచనలతో మున్సిపల్, అటవీశాఖ అధికారులు దీనిని నిర్మిస్తున్నారు
సిరిసిల్ల పట్టణంకు 10 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్-హరిదాసునగర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పట్టణ ప్రజల ఆహ్లాదం పంచేలా రూపుదిద్దుకుంటోంది.
సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ అర్బన్ పార్కు వచ్చే దీపావళి పండుగ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు పనులు వేగంగా చేపడుతున్నారు.
ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ పార్కులో ఇప్పటికే యోగ కేంద్రం, ప్రధాన ముఖ ద్వారం పూర్తి అయ్యింది.
వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఉద్యానవనాలు, పిల్లల ఆటస్థలాలు, అడ్వెంచర్ గేమ్స్, ఫుడ్ కోర్టులు, పిక్నిక్ ఏరియా, పంచతత్వ పాత్ , అల్పాబెటిక్ గార్డెన్, బటర్ ఫ్లై గార్డెన్ సహా మరిన్ని వసతులతో పార్క్ నిర్మాణం జరుగుతోంది.
మిషన్ మోడ్ లో పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కార్యనిర్వహక ఇంజనీర్ సుచరన్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్రధాన ముఖ ద్వారం తో పాటు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఉద్యానవనాలు, పిల్లల ఆటస్థలాలు, అడ్వెంచర్ గేమ్స్, ఫుడ్ కోర్టులు, పిక్నిక్ ఏరియా, పంచతత్వ పాత్ , అల్పాబెటిక్ గార్డెన్, బటర్ ఫ్లై గార్డెన్ లను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సుమారు 3 కిలో మీటర్ల మేర కాలినడకన అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంగ్లీష్ అల్ఫాబేట్ పక్కన ఆ అక్షరం తో ప్రారంభమయ్యే అటవీ జంతువు లేదా మొక్క ను చిత్రాన్ని పెయింటింగ్ చేయాలన్నారు.
మిగిలిన నిర్మాణ పనులతో పాటు
పెయింటింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.