సీఎం కేసీఆర్ తోనే రాష్టం అభివృద్ధి సాధ్యం
మంత్రి హరీష్ రావు
జహీరాబాద్ సెప్టెంబర్ 24( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రం అబివృద్ది కేవలం సీఎం కేసీఆర్ తోనే సాద్ద్యం అని బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత కరెంట్ ఉండదు రైతులకు మీటర్లు వస్తయి అని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో ని జహీరాబాద్ మొగుడం పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగిన ప్రాంతం ఇవాళ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మార్చాం అన్నారు.బోర్ల దగ్గర, బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ముక్కు పిండి కరెంటు చార్జీలు వసూలుచేయాలంట చార్ఝీలు వసూలు చేస్తేనే రాష్ట్రానికి అప్పులు ఇస్తమంటున్నరు ఇది ఎంత వరకు సమంజసం అన్నారు.కరెంటు మీటర్లు పెట్టాలా వద్దా మీరే చెప్పండి అంటూ ప్రజలకు అడిగారు.గిరిజన విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురి ని ఆకట్టుకున్నాయి. మంత్రి అడిగిన క్విజ్ పోటీలో గెలిచిన రాద అనే విద్యార్థి కి మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ, ఆత్మ కమిటీ చైర్మన్ లు ఉమాకాంత్ పాటిల్ పెంటరెడ్డి,జిల్లా కలెక్టర్ శరత్, జడ్పిటిసి అరుణ మోహన్ రెడ్డి, సర్పంచ్ సుగుణమ్మ, నాయకులు కుత్బొద్దిన్, నామ రవికిరణ్, రామకృష్ణ బాబీ, తిమోతి,ఈశ్వర్ రెడ్డి, సజ్జపూర్ తండా సర్పంచ్ శంకర్ నాయక్,అధికారులు సర్పంచ్ ఎంపిటిసి లు తదితరులు పాల్గొన్నారు.