సీఎం పర్యటనలో విషాదం
ఖమ్మం: ఈరోజు పాల్వంచ మున్సిపల్ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నరు. ఈ భవనానికి సంబంధించిన విద్యుత్ డైవర్సన్ పనులు చేస్తున్న అంజయ్‌రావు అనే లైన్మెన్ కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ప్రమాదానికి అధికారుల తొందరపాటే కారణమని, అధికారుల నిర్లక్ష్యంతోనే అంజన్రావుకు కరెంట్‌షాక్ తగిలిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.