సీఎం సహాయనిది చెక్కు పంపిణీ
గరిడేపల్లి, సెప్టెంబర్ 30 (జనం సాక్షి): మండల కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయం నందు హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం మేరకు సీఎం సహాయనిధి చెక్కును పేరు బొలిగొర్ల
కామేశ్వరమ్మ భర్త అరవింద్ కి 24 వేల రూపాయలను లబ్ధిదారులని గడ్డిపల్లి గ్రామస్తులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల పార్టీ తెరాస అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్, గడ్డిపల్లి ఎంపిటిసి మేకల స్రవంతి శోభన్ బాబు, గడ్డిపల్లి మాజీ సర్పంచ్ మాశెట్టి శ్రీహరి, తాళ్లమల్కాపురం సర్పంచ్ జ్యోతి గురవయ్య, గరిడేపల్లి సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గుగులోత్ శంకర్ నాయక్, తెరాస పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.