సీపీవోగా శివరాంనాయకర్‌

జులై మొదటివారంలో బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం, జూన్‌ 27 : జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో ఎం.శివరాంనాయకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. 1984లో డిప్యూటీ స్టాటిస్టికల్‌ అధికారిగా ఉద్యోగంలో చేరిన ఆయనకు 1995లో ఎ.డి.గా పదోన్నతి లభించింది. 1995-96 ప్రాంతంలో జిల్లాలో ఏడీగా పని చేశారు. 1996-2003 వరకు విశాఖపట్నం జిల్లాలో చేస్తుండగా సీపీవోగా పదోన్నతి లభించింది. 2003-04 వరకు కడప సీపీవోగా, 2004-07 వరకు శ్రీకాకుళం జిల్లాలో పని చేశారు. 2007-10లో విశాఖపట్నంలో, 2011 నుంచి నెల్లూరు సీపీవోగా పని చేస్తున్నారు. ప్రస్తుతం పదోన్నతి పొంది జేడీ హోదాలో జిల్లా సీపీవోగా వస్తున్నారు.