స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
శ్రావణంలో పెరిగే ఛాన్స్ ఉందంటున్న మార్కెట్ వర్గాలు
న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి కొద్ది రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని.. కొనుగోళ్ళకు అనుగుణంగా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. మార్చి 31 నుంచి ఇప్పటి వరకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,740 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల పై 2,990 పెరిగింది. దీనిని బట్టి చూస్తే గత నాలుగు నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నా అది స్వల్పంగానే ఉంటోంది. ధరలు పెరిగినప్పుడు భారీగా ఉండడం, తగ్గుదల స్వల్పంగా ఉండడం మార్కెట్లో సర్వసాధారణంగా మారింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840గా ఉంది. 10 గ్రాములు ధర రూ.10 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి 10 గ్రాముల బంగారం రూ.47,830 కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,840 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,840 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,000 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.43,840 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,390 ఉంది. ఢల్లీిలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,990 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,340 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.45,690 ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై నిన్న రూ.5,200 తగ్గగా, ఈ రోజు రూ.1,000 తగ్గింది. సోమవారం కిలో వెండి రూ.65,000 గా ఉంది. ఏప్రిల్ 1న వెండి ధర కేజీ రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.65,000 ఉంది. అంటే 130 రోజుల్లో వెండి ధర రూ.2,300 తగ్గినట్లు లెక్క.