హమాలీల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా
హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి): హమాలీల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో టీఎస్ డబ్ల్యూ వేరేస్ గౌడ్ హమాలీల సమావేశం మంగళవారం జరిగిందన్నారు. ఈ సమావేశంలో నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్టర్ ఎస్సై పిఎఫ్ పే చేస్తున్నారా, కాంట్రాక్ట్ తో మాట్లాడి వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఈఎస్ఐ కార్డు ఉన్నవారు వారి ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేసుకోగలరు అన్నారు. ఈ కార్యక్రమంలో గోపయ్య, రామకృష్ణ, వెంకన్న, కందుల వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి వెంకన్న, నరసింహారావు, గువ్వల వీరబాబు, గుంజ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.