హుజూరాబాద్‌లో దసరా జరుపుకున్న బాల్క సుమన్
దళితులో కలసి భోజనం చేసిన ఎమ్మెల్యే
హుజూరాబాద్,అక్టోబర్16(జనంసాక్షి ): హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ దళితబిడ్డలతో సరదాగా గడిపారు. పండుగ
రోజున వారితో కలిసి భోజనం చేశారు. కమలాపూర్ పట్టణానికి చెందిన మాట్ల యాదగిరి.. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పండుగరోజున భోజనానికి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు వెళ్లిన బాల్క సుమన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎమ్మెల్యే సుమన్‌తో తమ సాదకబాధకాలు చెప్పుకున్నారు స్థానికులు. అనంతరం మాట్ల యాదగిరి ఏర్పాటు చేసిన దసరా ప్రేమవిందులో తోటి దళితబిడ్డలతో కలిసి భోజనం చేశారు బాల్క సుమన్. తర్వాత స్థానిక పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు స్థానిక యువకులు ఆసక్తి చూపారు.