అనారోగ్యంతో బాధపడుతున్న సర్పంచ్ ను ఆదుకున్న జెడ్పిటిసి
శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : శివ్వంపేట మండలం పాంబండ గ్రామ సర్పంచ్ తలారి శివులు గత కొన్నాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా శుక్రవారం సర్పంచ్ ను పరామర్శించి, 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, టీఆరెఎస్ యువ నాయకులు వీరేశ్, శివంపేట ఉప సర్పంచ్ రాజపేట పద్మ వెంకటేష్, ఖదీర్, షేక్ అలీ, రవినాయక్ గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.