అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వెంకటేష్
కర్నూలు, జూలై 21 : పట్టణ మున్సిపల్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర చిన్న నీటి వనరుల శాఖామంత్రి టి.జి. వెంకటేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని పాత బస్టాండ్‌లో మినరల్ వాటర్ ప్లాంట్, మరో రెండు ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అదే విధంగా పట్టణంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల వద్ద తొమ్మిది లక్షల రూపాయల అంచనాతో నిర్మించనున్న సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.