అమరుల త్యాగాలను మరచిన కేసీఆర్
జనం సాక్షి, హసన్పర్తి:
హసన్పర్తి 66వ డివిజన్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు మేకల హరిశంకర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి యందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరైన వారు మాట్లాడుతూ….
రోశయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెప్టెంబర్ 17 ని తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించమని కెసిఆర్ అడిగింది వాస్తవమా కాదా.
వేల పుస్తకాలు చదివి మేధావిని అని చెప్పుకుంటున్న కేసీఆర్ తెలంగాణ గడ్డ పై కొమురం భీమ్,రాంజీ గోండ్, చాకలి ఐలమ్మ, మొగిలయ్యగౌడ్,మాడపాతి హనుమంతరావు గారు వరంగల్ కోటలో అనేక వందలాది మంది వీరులు పోరాటం చేసింది వాస్తవమా కాదా.
తెలంగాణ గడ్డపై మిలటరీ ఆపరేషన్,ఆపరేషన్ పోలో పోలీస్ చర్య నిర్వహించింది వాస్తవమా కాదా.
నిజాంఖాన్ సర్ధార్ వల్లాభాయ్ పటేల్ గారి ముందు తలవంచింది వాస్తవమా కాదా.ఇంకా అనేక అమర వీరుల గాథలు మరిచి రాష్ర్ట ప్రజల ఆత్మగౌరవాన్ని మంట గలిపిన కెసిఆర్ జాతీయ సమైక్యత గా పేరు పెట్టడం దురదృష్టకరమని జాతీయ సమైక్యతా దినోత్సవం ఎట్లయితదో చెప్పాలని కేసీఆర్ని ప్రశ్నించారు.చరిత్రను మరచిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.విమోచన దినోత్సవం రోజున నిజాం గురించి ప్రస్తావన తీయని కేసీఆర్ నిజాం ఘోరీ ప్రక్కన ఆరు గజాల జాగా కోసం వీలునామా రాసుకోమని కెసిఆర్ ని డిమాండ్ చేశారు.నిజాం ఆకృత్యాలను ఎదుర్కొన్న అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిజం చేసిన అరాచకాలు రజాకార్లు చేసిన దుర్మార్గాలను ప్రస్తావించకుండా కెసిఆర్ సెప్టెంబర్ 17నాడు జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో జెండా ఎగురవేయడం ఒక నాటకమని అన్నారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ శివన్న మాట్లాడుతూ… సెప్టెంబర్ 17
జాతీయ సమైక్యతా దినోత్సవం కాదు తెలంగాణ విమోచన మాత్రమే కేవలం ఒక ఎంఐఎం ఓట్ల కోసం కెసిఆర్ అమరుల త్యాగాలను అవమానపరిచి మతోన్మాది లాగా వ్యవహరించాడని,కెసిఆర్ తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని,ఎనిమిది ఏండ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని బీజేపీ పోరాడుతుందని,సమైక్యతా దినోత్సవం పేరుతో కెసిఆర్ డ్రామా చేస్తే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని,నిజమైన తెలంగాణ వాది కెసిఆర్ కాదని మరో నిజాం అని,ఓవైసీ డైరెక్షన్లో జాతీయ సమైక్యతా దినోత్సవం కెసిఆర్ జరిపాడని అన్నారు.రజాకార్ అకృత్యాల నుంచి నిజాం నిరంకుశ పాలన నుంచి ఈ తెలంగాణ గడ్డకు విమోచన లభించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపెల్లి కుమారస్వామి ,హన్మకొండ జిల్లా కార్యదర్శి గుండమీది శ్రీనివాస్ గారు,సీనియర్ నాయకులు మారపెల్లి రామ్ చంద్రారెడ్డి,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగమళ్ల సంతోష్ గారు,డివిజన్ ప్రధాన కార్యదర్శి తంగలపల్లి రమేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల సంపత్,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్యాంసుందర్,మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గరిగె మాధవి,బీజేవైఎం జిల్లా కార్యదర్శి కందుకూరి సాయి చంద్,డివిజన్ యువ మోర్చా అధ్యక్షులు పోలెపాక నిషాంత్,మహిళా మోర్చా డివిజన్ అధ్యక్షురాలు గోడిశాల లలిత,డివిజన్ ఉపాధ్యక్షులు వేల్పుల చిన్న రమేష్,ఓబీసీ మోర్చా డివిజన్ ఉపాధ్యక్షులు దాది మధుసూదన్,కిసాన్ మోర్చా డివిజన్ ఉపాధ్యక్షులు పార్శ సతీష్ ,డివిజన్ కార్యదర్శి వెలిగేటి తిరుపతిరెడ్డి,నాయకులు దాసరి రాజు,గంట సత్యం కుంభార్కర్ సాయికిరణ్,పోతరాజు ప్రభాకర్,ఆకుతోట సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|