ఆర్బీఐ ఇన్‌కం టాక్స్ ఖాతాకు మళ్లించిన రూ.1274 కోట్లు తిరిగివ్వండి
– నూతన పారిశ్రామిక విధానానికి అరుణ్‌జైట్లీ కితాబు
– కేంద్ర మంత్రితో కేటీఆర్ భేటీ
– ఓటుకు నోటు కేసు ఆంధ్రులకు సంబంధం లేదు
– సెక్షన్ 8 హైదరాబాద్‌లో కుదరదు
– మంత్రి కె.రామారావు
న్యూఢిల్లీ,జూన్27(జనంసాక్షి):తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్‌పై ఉన్న సుంకాన్ని ఆర్బీఐ తీసుకోవటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లానని తెలం గాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆర్బీఐ తీసుకున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేసిన ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు ఇవ్వకుండా రూ.1274 కోట్లను ఆర్టీఐ ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు ట్రాన్స్ఫర్ చేసిందని తెలిపారు. డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం చట్టవ్యతి రకమని అరుణ్‌జైట్లీకి ఫిర్యాదు చేశామన్నారు. రికవరీ చేయాల్సి వస్తే 58, 42 నిష్పత్తిలో చేయాలని తెలిపినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బీసీఎల్ ఇంకా విభజింపబ డలేదు. ఆంధ్రప్రదేశ్ నిధుల నుంచి కాకుండా తెలంగాణ నిధుల నుంచే ఆర్టీఐ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం సరికాద న్నారు. కేంద్ర రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అరుణ్‌జైట్లీ హావిూ ఇచ్చారని మంత్రి చెప్పారుతెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానంపై జైట్లీ అడిగారని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం బాగుందని జైట్లీ కితాబు ఇచ్చారని వెల్లడించారు. కేంద్ర పారిశ్రామిక విధానంలో కొన్ని అంశాలు చేర్చేందుకు తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రతిని జైట్లీ అడిగారని చెప్పారు. రాష్ట్రంలో సెక్షన్-8 అమలు చేస్తారనుకోవటం లే దన్నారు. గవర్నర్ మార్పు రాష్ట్రాలకు చెందినది కాదని, కేం ద్రం పరిధిలోని అంశమన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజలకు ప్రతినిధిని అని చెప్పి ఐదు కోట్ల రూపాయల కేసు నుంచి బయటపడాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు చూస్తున్నారని తెలంగాణ మంత్రి కె.తారక రామా రావు వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు దిక్కుమాలిన కేసుతో ఆంధ్రప్రజలు ఐదు కోట్ల మందికి ఏమి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. తన వ్యక్తిగత కేసును ప్రజల మెడకుచుట్టి వారి సానుభూతి పొందాలని బాబు చూప్తున్నాడని అన్నారు. ఢిల్లీలో కెటిఆర్ విూడియాతో మాట్లాడుతూ ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎలాగైనా కేసు నుంచి బయటపడాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఏదో రకంగా కేసు నుంచి బయటపడతానని అనుకోవడం ఆయన భ్రమేనని కెటిఆర్ పేర్కొన్నారు. తెలుగుదేశం అద్యక్షుడుగా ఈ కేసులో ఆయన ఇరుక్కున్నారని, కాకపోతే యాదృచ్చికంగా ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నారని,అంతమాత్రాన కేసు లేకుండా పోదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చిన మంత్రి కెటిఆర్ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తుందన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తే బాగుటుందని మంత్రి కేటీఆర్ సూచించారు. చంద్రబాబు ఐదుకోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడం లేదని, రూ. ఐదుకోట్ల కుంభకోణం నుంచి బయటపడేందుకు పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన తప్పును ఆంధ్రా ప్రజలందరిపైనా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరుణ్‌జైట్లీ సెక్షన్-8పై క్లారిటీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రాజ్యంగ సవరణ చేయకుండా రాష్ట్ర శాంతి భద్రతలను గవర్నర్‌కు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.




