*ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ*
మునగాల, ఆగష్టు 13(జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్ శనివారం ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎల్ వెంకయ్య, వార్డు సభ్యురాలు ఎం. రంగమ్మ, లంజపల్లి శ్రీనివాస్, కెవిఆర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
