ఇంటి పెద్దదిక్కు కోల్పోవడం బాధాకరం :- సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
రుద్రూర్( జనంసాక్షి): రుద్రూర్ మండల తెరాస పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ చిన్న నాన్న పత్తి హన్మండ్లు ఈ నెల 1 వ తేదీన అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మరియు వారి తనయుడు పోచారం సురేందర్ రెడ్డి బుధవారం రోజున రుద్రూర్ గ్రామానికి విచ్చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కీర్తి శేషులు పత్తి హన్మండ్లు చిత్ర పటానికి పూలను వేసి ఆయన ఆత్మాకు శాంతి కలగాలని కోరుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంటి పెద్దదిక్కు కోల్పోవడం చాలా బాధకరమాని వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో
మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ ,అక్కపల్లి నాగేందర్, పత్తి రాము, సంగయ్య, సంజీవ్ రెడ్డి, పత్తి సావిత్రి, పత్తి నవీన్,మొద్దుల నర్సయ్య, నాట్కరి సాయిలు, గ్రామ పెద్దలు, ఇతర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు