ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కిన టిడిపి: ఎమ్మెల్యే

అనంతపురం,మే17(జ‌నం సాక్షి ): ఏటా 20-30 టీఎంసీలు జిల్లాకు వస్తున్నా.. ఒక్క ఎకరాకు నీరిచ్చిన పాపాన పోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలున్నారు. ఒక్కసారైన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారా అంటూ ప్రశ్నించారు. హంద్రీనీవా ద్వారా అనంతపురం నుంచి చిత్తూరు వరకు నీరు వెళుతుందని, తాకట్టు పెట్టిన బంగారం నగలు వెనక్కి వస్తాయని ఆశపడిన రైతులకు కన్నీరే మిగిలిందన్నారు.  వీరంతా రూ.కోట్లు దోచుకుంటూ ప్రజా కంటకులుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. రాష్ట్రమంతటా తెదేపా మినీమహానాడులు నిర్వహించి, ప్రజలను మరింత మభ్యపెడుతున్నారన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై చేస్తున్న దుష్పాచ్రానికే వీరికి సమయం సరిపోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. రాష్ట్రానికి  ప్రత్యేక ¬దా కోసం పోరాడదామని అడిగితే మోహం చాటేశారు. ముఖ్యమంత్రితో మొదలుకుని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని  పిలుపునిచ్చారు.రైతులు, డ్వాక్రా సంఘాలు, చేనేతలకు రుణమాఫీ చేశామని చెబుతున్నా.. అప్పుల్లో కూరుకుపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాను మట్టి కరిపించాలన్నారు. 

తాజావార్తలు