ఉమ్మడి కుటుంబమే భవితకు ఆలంబన
వెనుకటి రోజుల్లో నాన్న వేలు పట్టి నడక నేర్చేది, అమ్మ చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది, నాయణమ్మ కథలు, జీవిత పాఠాలు చెప్పేది. తాతయ్య వాలు కుర్చీ మీద నడుం వాల్చి అనుభవాలు, జీవిత పాఠాలు చెప్పేవారు. బాబాయి, అత్తమ్మ, మామయ్యలు తెచ్చే ఆటవస్తువులు, మిఠాయిలు తీయని అనుబం ధాలను పంచేది. తొలి పఠశాల కుటుంబంలో నేర్చే పాఠాలు ఎదిగే పిల్లల్లో గూడు కట్టుకొని మనసులో చెరగని ముద్ర లేసేవి. ఉమ్మడి కుటుంబం ఒక హ్యూమన్ ఫ్యాక్టరీ అని భావితరాలకు నేర్పుతూ దిక్సూచి అయ్యేది.
ఉమ్మడి కుటుంబం అంటే ….
కుటుంబం అనేది తొక సామాజిక వ్యవస్థ సమాజంలో ఒక మౌలికమైన కుదురు. ఉమ్మడి కుటుంబం అంటే కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, మనమలు, మనమరాండ్లు ఇలా అందరు కలిసి ఉండడం. ప్రపంచీకరణ కారణంగా ఉమ్మడి కుటుంబాలు వ్యక్తి కుటుంబాలుగా మారిపోయాయి. ఫ్యామిలి అంటే మేమిద్దరం ` మాకిద్దరు అనే ఆలోచన మొదలైంది. రాజస్థాన్ యూనివర్శిటి సోషియాలజి ప్రోఫెసర్ సుశీలాజైన్, వ్యక్తి కుటుంబంలో భార్యభర్తల విడాకులు, పిల్లల క్రష్ జీవితాలు, కుమారుల ప్రేమ వ్యవహారాలు, ఆత్మహత్యలు, ఒత్తిళ్లు, రక్తపోటు మధమేహ వ్యాధలు మొదలయ్యం టారు మనో విజ్ఞానవేత్తలు. ఒకప్పుడు ఎదురయ్యే ప్రతి సమస్యకు సరిష్కారం దొరికేది. ఉమ్మడి కుటుంబాల ఇండ్లన్ని రోజు పండగా వాతావరణాన్ని తలపించేవంటారు భారతీయ కుటుంబ వ్యవస్థపై పరిశోధనలు చేసిన ప్రోఫెర్ సుస్మితా మల్‌హోత్ర, డాక్టర్ స్టాలస్టికస్.
ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నతితో…
ఉమ్మడి కుటుంబాలు చీలిపోవడానికి మఖ్యకారణం మానవ సంబందాలన్ని వ్యాపార సంబంధాలుగా మారి పోవడమే అంటారు సామాజిక వేత్తలు. డబ్బు ప్రధాన పాత్ర పోషించడం వల్ల ప్రేమాను రాగాలు బక్కచిక్కి బలహీనమైపోతున్నాయి. బంధాలు అనుబంధాలు అటక్కెక్కాయి. నేను నాది అనే భావన మనషుల్లో ఓ మానసిక జబ్బుగా మారింది. తల్లి దండ్రుల సంపాదనే ధ్యేయంగా పరుగులు తీస్తుండంతో పెద్దలెవరు ఇంటిపట్టున ఉండరు. కిషోరవస్థలోని పిల్లలు టీవీలు, సినిమాల్లో దృష్యాలను చూసి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ జైలుపాలవుతున్నారు. తల్లిదుండ్రులు చేసే చదువులు ఒత్తిడి, పిల్లల్ని ఆందోళనలకు గురి చేస్తూ ఆత్మహత్యల వైపు దారి తీస్తున్యాఇ. దొంగ చాటు ప్రేమ వివాహాలు, పెద్దల అనుమతి పొందకపోవడంతో నిరాశచెందుతున్న ప్రేమికులు మరణమే శరణం అనుకుంటున్నారు.
ఉమ్మడి కుటుంబం ఓ కాంతిపుంజం…
నిస్తేజమైన మానవ జీవితంలో ఉమ్మడి కుటుంబం ఓ కాంతిపుంజం అంటాడు జార్జి ఫెర్నార్డ్‌షా. ఉమ్మడి కుటుంబం ఒకరి పెద్దరికంలో నడుస్తూ అందరిని సంతృప్తి పరుస్తుంది. కుటుంబ సభ్యుల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సర్దుబాటు లక్షణం అలవడుతుంది. ఐక్యమత్యాన్ని పెంచి అందరిలో ప్రశాంతతను కలుగ జేస్తుంది.
ప్రముఖ మానసిక తత్వవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు తల్లిదండ్రుల కంటే అమ్మమ్మ, నాయణమ్మలకంటే తాత్య సహచర్యమే ఎంతో మనోవికాసాన్ని కలిగిస్తుంది. అందుకే ఉమ్మడి కుటుంబంలో పిల్లలు, యువతీ యువకులు క్రమశిక్షణే కాకుండాఇ జీవిత పాఠాలు నేర్చుకునే వీలుంటుంది. చక్కని శీలనిర్మాణం జరిగే అవకాశముం టుంది. అసాంఘిక కార్యక్రమాలకుఅడ్డుకట్ట పడుతుంది. మంచి ఆలోచనలు కలిగి నిర్మాణాత్మకమైన పనులు చేపట్ట గలుగుతారు. భారత దేశ ఉమ్మడి కుటుంబాల్ని చూసిన పాశ్చాత్యుడు మన కుటుంబ వ్యవస్థను చూసి ఈ రోజు ఆశ్యర్యపడుతుంటారు. ఎందుకంటే విభిన్న మనస్తత్వాల వ్యక్తులు కుటుంబ పెద్ద చెప్పినట్లు విని సమాధానపడుతూ నడుచుకోవడం. మొన్న మధ్య హైద్రాబాద్ లో ‘21వి శతాబ్దంలో కుటుంబం’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో మనదేశంలోని సామాజిక వేత్తలు తమ అభిప్రాయా లను తెలుపుతూ నేటిఆ పరిస్థిల్లో ఉమ్మడి కటుంబాల ఆవశ్యకతను వివరించారు. ఉమ్మడి కుటుంబాలనుండి వచ్చినవారే ఎక్కువ శాతం చక్కని మానవ సంబంధాలన కలిగుంటారని ఏ పాఠశాల, విశ్వవిద్యాలయం నేర్పని మానవతావిలువలు, నైతిక విలువలు, వ్యక్తిగత జీవన నైపుణ్యాలు సామూహిక ప్రవర్తనా పద్దతులు, సామాజిక కట్టబాట్లు కలిగి ఉంటారని తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో విలువలతో కూడిన జీవన విధానాలు అలవర్చుకోవడానికి ఉమ్మడి కుటుంబమే ఒక విద్యాలయం అంటారు. ఉమెన్స్ కాలేజీ హైద్రా బాద్ ప్రొఫెసర్ యంవి లక్ష్మీదేవి. ఏ కారణంగానో జీవితాన్ని అనుభవించ ఇష్టపడక ఆత్మహ త్యకు పాల్పడే యువతీ యువకు లకు కుటుబాల్లోని పెద్దలు మంచి కౌన్సిలర్లు. వారు మాత్రమే సషలైజేషన్ డీన్ ప్రోఫెసర్ కె జాక బ్‌సన్ అంటారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మరబొమ్మల్లా పుస్తకాల పురుగాలా తయారు చేస్తున్న తల్లిదండ్రులుమారాలంటే ఉమ్మడి కుటుంబాల వల్లే సాధ్యం అంటా రు.డాక్టర్ బివి పట్టాభిరామ్. చాలామంది యువతీయువకులు నవీన సాంకేతిక దుశ్చర్యలకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీరికి పెద్దల సహచర్యం లభిస్తే ఇలాంటి అకృత్యాలు జరిగే అవకాశం తక్కువంటున్నారు అను భజ్ఞులు. తల్లిదండ్రులు, అన్నద మ్ములు, అక్కచెల్లెళ్లు, మనుమలు మనమరాండ్లు, ఒక చోట కలుసుకోవడాని ఉమ్మడికుటుంబమే ఓ గొప్ప వేదిక. ఇలా కలిసిపోవడం వల్ల అనుబంధాలు, ఆత్మీయతలు ప్రతి ఒక్కరిలో పెరుగుతాయి. మంచిచెడుల విశ్లేషణకు ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటుండదని సామాజిక వేత్తల అభిప్రాయం. ఏది ఏమైనా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కుటుంబాలు తయారు కాగలిగినప్పుడే ఆ కుటుంబ సభ్యులు సానుకూల దృక్పధం కలిగి ఉంటారు. పోటీ తత్వాన్ని అలవర్చుకోగలరు. ఉమ్మడి కుటుంబం అనే విద్యాలయంనుండి వచ్చిన వారే పోటీల్లో నెగ్గి ఉన్నతోద్యోగాలు చేపట్టగలుగుతున్నారని, క్షమ, దయాదాక్షిణ్యాలు కలిగిఉండి ఉద్యోగాల్లో రాణిస్తున్నారని ఈ మధ్య జరిగిన పరిశోధనలు తెలుపుతున్నాయి.
` పరికిపండ్ల సారంగపాణి
పేరెంట్ ఎడ్యుకేటర్Êకౌన్సిలింగ్ సైకాలజిస్ట్
వరంగల్
సెల్ 984963090