ఎన్ని దాడుల జరిగిన ప్రజల పక్షమే

4

– జీవో ద్వారా భూసేకరణ మంచిదికాదు

– సీమాంధ్ర అభివృద్ధి నమూనాను తిరస్కరిస్తున్నాం

– మూసివేత కంపెనీలను తెరవండి

– ఓపెన్‌ కాస్ట్‌, విద్యా,వైద్యం మా ప్రధాన ఎజెండా

– టీజేఏసీ ప్రొఫెసర్‌ కొదండరాం

హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): తెలంగాణుద్యమంలో ఎలాగయితే కీలక భూమిక పోషించామో ఇప్పుడు కూడా ప్రజాసమస్యలపై అంతే భూమిక పోషిస్తామని పొలిటికల్‌ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలే ఇప్పుడు తమ అజెండా అని అన్నారు. తమకు ప్రజలు, అభివృద్ది అన్న భాషే తప్ప మరోటి తెలియదన్నారు. అలాగే విమర్శలను లెక్కచేయబోమన్నారు. ఆనాడు తెలంగాణ ఎజెండా అయితే ఇప్పుడు ప్రజా సమస్యలు ఎజెండా అని అన్నారు.  తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ తాము ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. జెఎసి లేదనుకుంటే మంత్రులు అసలు మాట్లాడేవారు కాదు కదా.. వారు ఇంతమంది అంతగా మాట్లాడారంటేనే జెఎసి ఉందని కదా అని

ఆయన అన్నారు.తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ల అభివృద్దే లక్ష్యంగా జెఎసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.జెఎసిని ఏర్పాటుచేసి కోదండారామ్‌ ను నియమించింది కెసిఆర్‌ కదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఎవరు ఏర్పాటు చేసినా తెలంగాణ లక్ష్య సాధనకోసమని , తెలంగాణ సాధించిన తర్వాత కూడా అబివృద్ది కోసం అది కొనసాగాలని అప్పుడే అనుకోవడం జరిగిందని,కావాలంటే పాత రికార్డులు చూసుకోవచ్చని కోదండరామ్‌ అన్నారు. తనది నలభై ఏళ్ల జీవితం అని, నలుగురుకు చెబుతా కాని, నలుగురితో చెప్పించుకోనని ఆయన అన్నారు.కెసిఆర్‌ కు, విూకు ఎందుకు గ్యాప్‌ వచ్చిందని అడిగితే అడగవలసిన వారిని అడగండి అని ఆయన జవాబు ఇచ్చారు. తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి తీరుతామని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రజా సంఘాలు ఇలా పనిచేయడం విన్నూత్న ప్రయోగం అని ఆయన అన్నారు. తెలంగణ విద్యా వ్యవస్థపై రౌండ్‌ టేబుల్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.మిషన్‌ భగీరద డిపిఆర్‌ విడుదల చేయాలని ఆయన కోరారు. మూతపడిన కంపెనీల పునరుద్ధరణ కోసం శ్రమిస్తున్నట్లు చెప్పారు. చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై నియంత్రణ మంచిదే అయినా.. పోలీసుల తనిఖీలు సరికాదని హితవు పలికారు. జీవో ద్వారా భూసేకరణ విధానం సరికాదన్నారు. మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితుల కోసం త్వరలో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఓపెన్‌ కాస్ట్‌ గనులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.  తెలంగాణ వచ్చాక అభివృద్ధి కోసం పనిచేయాలని జేఏసీ ఏర్పడ్డ నాడే నిర్ణయించుకున్నానని  కోదండరామ్‌ స్పష్టం చేశారు. విమర్శలను పట్టించుకోకుండా తమ లక్ష్యాల కోసం పోరాడతామని ఆయన చెప్పారు. నలుగురికి చెప్పే స్థితిలో ఉన్నా.. చెప్పించుకునే స్థితిలో లేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అని ఆయన స్పష్టం చేశారు. తమ వెనక ఉన్నది ప్రజలేనని ఆయన అన్నారు. జేఏసీకి తెలంగాణ ప్రజలు సహకరించాలని కోదండరామ్‌ కోరారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన ముందుకు వెళ్తామన్నారు జేఏసీ ప్రజాపక్షమని? తెలంగాణ ప్రజల కేంద్రంగా సామాజిక న్యాయం పునాదిగా.. అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం అన్నారు.  దాదాపు అందరూ కూడా జేఏసీ కార్యాచరణ ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా నిర్ణయించామన్నారు. గ్రామ స్థాయి నుంచి నిర్మించుకుంటామన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యసాధనకు ముందుకు వెళతాం. మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవు. ప్రజల కోసమే మా పోరాటం. మళ్లీ అదే చెబుతున్నాం. మూసేసిన కంపెనీలు, కరువు, ఓపెన్‌ క్యాస్టులపై పని చేయాలనుకున్నాం. మరిన్ని ప్రాధాన్యతా అంశాలు కూడా తీసుకున్నాం. కులవృత్తులు, వ్యవసాయం, చేతి వృత్తులు. నిజాం షుగర్స్‌ కంపెనీ గురించి పోరాడుతున్న వారికి మా మద్దతు ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అదే కోరుతున్నాం. ఉత్పత్తిని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఓపెన్‌ క్యాస్ట్‌ గనులపై జూన్‌లో జిల్లాల్లో తిరుగుతాం. సీఎండీ అపాయింట్‌ మెంట్‌ కూడా కోరాం. ఓపెన్‌ క్యాస్టులను ఆపడానికి మా పోరాటన్ని కొనసాగిస్తాం. కరువుపై విద్యావంతుల వేదిక తయారు చేసిన నివేదికను చీఫ్‌ సెక్రటరీకి ఇచ్చాం. ? కరువు కు సంబంధించి మ్యాన్యువల్‌ సవరణకు చట్టబద్ధత ఇవ్వాలని కోరుతున్నాం.

విద్యారంగంపై? యూనివర్సిటీలలో వీసీలు, టీచింగ్‌ స్టాఫ్‌ లేదు. విధాన ప్రకటన రావాలని కోరుతున్నాం. ఓయూ వేదికగా సదస్సు నిర్వహించాలనుకుంటున్నాం. విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయి. అందరికీ ఉచిత విద్య అందించాలని కోరుకుంటున్నాం. పోలీసులతో ప్రైవేట్‌ విద్యాసంస్థలపై దాడులు సరికాదు.. హైకోర్టు కూడా ఇదే చెప్పింది. తీర్పుకు విరుద్ధంగా పర్యవేక్షణ కొనసాగుతోంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం.

యూనివర్సిటీలు కాకుండా కాలేజీలు, టెక్నికల్‌ విద్య, స్కూల్‌ పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుపుతాం.

జీవో ప్రకారం భూసేకరణ సరికాదు. చట్టం ప్రకారం భూసేకరణ జరగాలి. మల్లన్న సాగర్‌ ప్రజలకు హావిూ ఇచ్చాం.  ప్రజలల్లో అవగాహన లేకుండా ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. చట్టాలపై ప్రజల్లో సెమినార్‌ నిర్వహిస్తాం. గజ్వేల్‌ లో భూసేకరణ చట్టంపై.. ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపై ప్రజల్లో అవగాహన కలిగిస్తాం. కేంద్ర భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా భూసేకరణ చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గజ్వేల్‌లో నిర్వాసితుల సమస్యలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామన్నారు. హైకోర్టు విభజన జరక్కపోతే? స్థానిక జడ్జీలకు ఇబ్బంది. నాలుగు రోజులుగా న్యాయమూర్తులు చేస్తున్న పోరాటానికి జిల్లా జేఏసీలు సంపూర్ణ మద్దతు తెలియచేయాలని కోరుతున్నాం. అందరికీ తాగు.. సాగు నీళ్ల అందించాలనే ప్రయత్నాలు మంచివే. డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టులను వెబ్‌ సైట్స్‌ లో ఉంచాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రజలకు మేలు జరిగేవిధంగా కాంట్రాక్టులు ఉండాలి. ఎస్సీ, బీసీలకు న్యాయమైన వాటా కలిగించాలని కోరుతున్నాం. పని చాలానే నెత్తిన పెట్టుకున్నాం. కానీ విజయవంతంగా చేస్తామని చెబుతున్నాం. విమర్శలు వస్తూనే ఉన్నాయి. పని మాత్రం ముందుకు పోతూనే ఉంటుంది. భవిష్యత్‌ లో కూడా ప్రజలు అండగా ఉండాలని కోరుతున్నాం. ఇందులో భాగంగానే జేఏసీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు  కోదండరాం తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ప్రజల తరపున పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీల సమస్యలపై త్వరలో సదస్సు నిర్వహిస్తామన్నారు. విద్యారంగంలో తీవ్రంగా సమస్యలు ఉన్నాయన్నారు. విద్యారంగంలో సమస్యల సాధనకు టీ జేఏసీ కృషి చేస్తుందన్నారు.ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. హైకోర్టు విభజనపై న్యాయమూర్తుల ఆందోళనకు మద్దతునిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెబ్‌సైట్లో పొందుపర్చాలని కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆ భాష నాకు రాదు..నా డిక్షనరీ చాలా చిన్నది

వారిభాషలో నేను మాట్లాడలేను..నాకా భాష రాదు మంత్రులు, ఎంపీలు తనపై చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సూటిగా సమాధానం చెప్పారు జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. తనకు ఆ భాషలో మాట్లాడ్డం రాదని.. తన డిక్షనరీ చిన్నదని అన్నారు. దాన్లో  ఆ పదాలు లేవన్నారు. అసలు వాటిపై సమాధానం చెప్పడం ఎందుకన్నారు. జేఏసీ లేకపోతే.. ఈ మాటలు ఎందుకు వస్తాయి. మాకు తెలంగాణ ప్రజలే ముఖ్యం.. కోదండరామ్‌ ఎవరు. తెలంగాణ ప్రజల పక్షం? తెలంగాణ వికాసం కోసం చర్చిద్దాం రండి. జేఏసీ ఎవరు ఏర్పాటు చేసినా.. తెలంగాణ అభివృద్ధి కోసమే ఏర్పాటు చేస్తున్నామని ఆనాడే చెప్పాము.  నా వెనకాల ప్రజలే ఉన్నారు. నలభై ఏళ్ళ ప్రజా జీవితం నాది. నలుగురికి చెప్పే స్థితిలో ఉన్నాను కానీ.. చెప్పించుకునే స్థితిలో లేను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా కృషి చేశామో.. అదే విధంగా అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఇది ప్రపంచంలోనే వినూత్న ప్రయోగం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం. తెలంగాణ వారసులుగా.. అఘోరానాథ్‌ చటోపాధ్యాయ దారిలోనే వెళుతున్నం. ఒక రైల్వే ఏర్పాటులో ఎన్ని అవాంతరాలు వచ్చినా నిజాంపై పోరాటాన్ని కొనసాగించారు ఆయన. అలాగే మేము కూడా ప్రజల పక్షం నిల్చుంటాం. వందేమాతరం ఉద్యమం నుంచి నిన్నటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పోరాటాలన్నీ ప్రజా ఎజెండాగానే చేశామని అన్నారు. రాజకీయ ప్రాధాన్యాలు లేకుండా ప్రజలకోసమే పని చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజలు మద్దతు తమకు ఉండాలని మరోసారి కోరారు. ప్రజల పక్షానే తెలంగాణ జేఏసీ ఉంటుందని కూడా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) బుధవారమిక్కడ సమావేశమై విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. సమావేశం అనంతరం కోదండరామ్‌ విూడియా సమావేశంలో మాట్లాడారు. ‘జేఏసీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. దాడుల జరిగినా వెనకడుగు వేసేది లేదు. వ్యవసాయం, కులవృత్తులు, ఓపెన్‌ కాస్ట్‌ సమస్యలపై పోరాడుతాం. ఓపెన్‌ కాస్‌ట్లకు వ్యతిరేకంగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తాం. నిజాం షుగర్స్‌ సహా మూతపడ్డ కంపెనీలను తెరిపించాలని కోరారు.

ప్రజా సంక్షేమమే టీజేఏసీ లక్ష్యం. నేను నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్న…ఎవరితోనో చెప్పించుకునే స్థితిలో లేను. రెండుసార్లు కేసీఆర్‌ అపాయింట్మెంట్‌ కోరినా ఇవ్వలేదు. ఉద్యోగుల జీవితాలు బాగుపడ్డట్టే..ప్రజల జీవితాలు కూడా బాగుపడాలి. నాపై విమర్శలు చేసినవారిలా నాకు ఆ భాష రాదు.’ అని కోదండరామ్‌ వ్యాఖ్యానించారు.