ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

కొత్తగూడెం,మే8(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీనుంచి చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. ఈ క్రమంలో చెక్కులు, పాస్‌ పుస్తకాలు ఆయా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాయి. రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ మొదటిదఫాలో పినపాక మండలం 17 గ్రామాల్లో 5700 మంది రైతులకు 5646 చెక్కుల ద్వారా రూ.4కోట్ల 80లక్షల 54వేల 180లను పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. పంపిణీ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం హాజరుకానున్నట్లు తెలిపారు.అలాగే కరకగూడెం మండలంలో 9 గ్రామాల్లో 3127మంది 3175 చెక్కుల ద్వారా రూ.3కోట్ల 88లక్షల 56వేల 30లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  గత ఏడాది డిసెంబర్‌ మాసం వరకు రెవెన్యూ అధికారులు భూప్రక్షాళన కార్యక్రమం చేపట్టి వాటికి కొత్త పాస్‌ పుస్తకాలతో పాటుగా రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.  మండలంలో 4032 మంది రైతులకు రైతు పట్టా పాస్‌ పుస్తకాలు అందించనున్నారు. అందులో గుండాల 594, కన్నాయిగూడెం 27, కాచనపల్లి 464, దామరతోగు 149, చినవెంకటాపురం 94, సాయనపల్లి 339, లింగగూడెం 837, ముత్తాపురం 850, మామకన్ను 226, శెట్టుపల్లి 506, గలబ 66 మంది రైతులకు చెక్కులతో పాటుగా పట్టాపాస్‌ పుస్తకాలు అందించనుండగా మండలంలో 
రెవెన్యూ అధికారులు ఏ, బీ రెండు బృందాలుగా ఏర్పడి పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతి రైతు తమ ఆధార్‌ కార్డు తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ప్రతి రైతు సహకరించాలని కోరారు.