ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ పాదయాత్ర నాల్గవ రోజులో భాగంగా గోవిందరావుపేట మండలానికి చేరుకున్న ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క.

క్విట్ ఇండియా  ఉద్యమం స్ఫూర్తితో భారత దేశాన్ని దోచుకు తింటున్న తెల్లదొరలను దేశం నుండి తరలించి భారతదేశానికి స్వాతంత్రం అందించింది కాంగ్రెస్ పార్టీ.
ములుగు జిల్లా
గోవిందరావుపేట ఆగస్టు 13(జనం సాక్షి):-
శనివారం గోవిందరావుపేట మండల చల్వాయి మరియు గోవిందరావుపేట గ్రామాల్లో ఆజాదీ కా గౌరవ పాదయాత్ర నాల్గోవరోజులో భాగంగా గోవిందరావుపేట మండలానికి చేరుకున్న ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ మంగళ హారతులు ఇస్తూ పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ పాదయాత్ర కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో భారతదేశాన్ని దోచుకుతింటున్న తెల్ల దొరలను దేశం నుండి తరలించి భారతదేశానికి స్వాతంత్య్రం అందించింది.కాంగ్రెస్ పార్టీ అని మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవ వేడుకలకు పిలుపునివ్వగా వెంటనే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ,టీపీసీసీ వజ్రోత్సవాలు కాదు ప్రజల కష్ట,సుఖాలను తెలుసుకోవాలని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఆజాదీ కా గౌరవ యాత్రకు పిలునిచ్చిందని అన్నారు. ఆ రోజున తెల్ల దొరల దగ్గరి నుండి భారతదేశాన్ని కాపాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశాన్ని దోచుకుతింటు కొందరి కార్పొరేట్ చేతుల్లో ప్రజా ధనాన్ని పెడుతూ భారతదేశ సంపదను దోచుకుతింటున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలన ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగిస్తున్న అని అన్నారు.ఎనిమిది ఏండ్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పేద ప్రజలకు ఒరిగిందేమి లేదని ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తా అని ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది లేదని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని నోట్ల రద్దు చేసి నల్ల ధనాన్ని వెలికి తీసి ఒక్కో పేద కుటుంబానికి 15లక్షల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తా అని ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని రాఫెల్ యుద్ధ విమానాల్లో కొన్ని వేల కోట్ల కుంభకోణం చేసిందని జి.ఎస్.టి. పేరుతో అక్రమంగా పన్నులు వసూలు చేస్తూ పేదల రక్తం తాగుతున్న పార్టీ బీజేపీ అని అన్నారు. పెట్రోల్,డీజిల్ లాంటి ఇంధన ధరల్ని పెంచి వంట గ్యాస్ మరియు నిత్యావసర సరుకుల ధరల్ని పెంచి సామాన్యుడి నడ్డి విరిచి బ్రతకలేని స్థాయికి తీసుకువెళ్లారని అన్నారు. మనుషుల మధ్య చిచ్చు పెడుతూ మత తత్వాన్ని రెచ్చగొట్టి మారణ హోమాన్ని సృష్టిస్తారని అన్నారు.ఇంతవరకు ఆదివాసీల హక్కులు కాలరాస్తు పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులతో అక్రమ కేసులు బనాయించారని పేద రైతుకు పంట రుణం మాఫీ చేయాలని మోడీ గారు గుజరాతీ కంపెనీలకు మాత్రం 10లక్షల కోట్లు రుణమాఫీ చేశారని అన్నారు.ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పేదలకు ఉపయోగ పడే సంక్షేమ పథకం లేదని అన్నారు.అలాగే సోనియాగాంధీ గారి చలువతో తెలంగాణ స్వరాష్ట్ర కలను నెరవేర్చుకున్న తెలంగాణ రాష్ట్రం రాబందుల చేతికి చిక్కి విల విలలాడుతూ ఉందని నీళ్లు,నిధులు నియామాకాలతో గద్దెనెక్కిన కేసీఆర్ గారు ఇంటికొక ఉధ్యోగం అన్నడు ఇవ్వలేదు అర్హులైన వారికి రెండు పడక గదులు అన్నాడు ఇవ్వలేదు దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల భూమి పోడు భూములకు పట్టాలు ఏక కాలంలో పంట ఋణమాఫీ, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు,సబ్సిడీ ఎరువులు, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి,గిరిజన మైనారిటీలకు 12% రిజర్వేషన్ లాంటివి ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నారని అన్నారు. నిర్దిష్ట ప్రణాళిక లేని పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ప్రభుత్వ స్థలాలను అమ్మి డబ్బులు దండుకుంది
తెరాస పార్టీ అని అన్నారు.ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆహార భద్రత హామీ చట్టం ఉపాధి హామీ చట్టం,భూ సంస్కరణల చట్టం,అటవీ హక్కుల చట్టం, ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ,రాజీవ్ పల్లెబాట,రాజీవ్ ఉపాధి అవకాశాలు,ఫీజ్ రీ యింబర్సుమెంట్,పోడు భూములకు హక్కు పత్రాలు,రైతులకు పంట రుణాలు,ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ,ఇందిరా జల ప్రభ,ఉచిత విద్యుత్ ఇందిరా క్రాంతి పథం, మహిళ సంఘాలకు రుణాలు,పెన్షన్లు,ఎస్.సి.,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రాజభరణాల రద్దు,బ్యాంకులు జాతీయం,ఎన్నో ప్రాజెక్టులు,కరకట్టలు లాంటి పథకాలతో ప్రజలను అభివృద్ధి చేసింది అని అన్నారు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూములకి పట్టాలు ఇస్తాం అని ధరణి పోర్టల్ తొలగించి అందరికి పట్టా పాసు బుక్కులు అందిస్తాం అని అర్హులైన అందరికి ఇండ్లు కట్టిస్తామని పంట రుణమాఫీ చేసి కొత్త పంట రుణాలు అందిస్తామని అన్నారు.కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. అధికార ప్రభుత్వాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని అన్నారు.
ఈ పాదయాత్ర కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి,టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, చల్ల నారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లాది రాంరెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, కన్నాయిగూడెం జడ్పీటీసీ కరంచంద్ గాంధీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ కార్మిక సంఘ మత్స్య శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ అనంత రెడ్డి చిటమట రఘు, మైల జయరాం రెడ్డి,ఎండి.అఫ్సర్ పాషా,వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు,వర్కింగ్ ప్రెసిడెంట్లు రసపుత్ సీతారాంనాయక్,బండి శ్రీనివాస్,సహకార సంఘ అధ్యక్షులు బొక్క సత్తిరెడ్డి,పన్నాల ఎల్లారెడ్డి,పులి సంపత్,మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి పాలడుగు వెంకటకృష్ణ, తేళ్ల హరిప్రసాద్ వేల్పుగొండ పూర్ణ, పాశం మాధవరెడ్డి గుండెబోయిన నాగలక్ష్మీ- అనిల్ యాదవ్,చాపల ఉమాదేవి,గోపిదాసు ఏడుకొండలు,ధారవత్ పూర్ణ- గాంగు, కణతల నాగేందర్ రావు,వేల్పుగొండ ప్రకాష్, రామచంద్రపు వెంకటేశ్వర్లు,  జడ్పీటీసీలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,సీనియర్ నాయకులు సర్పంచులు,గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ అధ్యక్షురాళ్ళు,యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,కాంగ్రెస్ మరియు సీతక్క అభిమానులు మరియు తదితర నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.