ఐక్యమత్యాన్ని చాటిన ముస్లిం పెద్దలు
చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్ట్ 07) :
కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఐకమత్యమే మహాబలం అని చాటిచెప్పిన అపురూప సందర్భం ఆదివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రమైన చండ్రుగొండలో జరిగిన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వీవీఆర్కే మూర్తి ని కలిసి ఐదు రోజుల ప్రతిష్ట కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు గాను శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకే వీధిలో జామా మసీదు, దేవతామూర్తుల ఆలయాలు పక్క పక్కనే ఆనుకొని ఉండడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. రాష్ట్రం నలుమూలల నుండి ప్రతిష్టకు విచ్చేసిన భక్తులు ఆనుకొని ఉన్న ఆలయాల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండే సోదర భావాన్ని చూసి ఐకమత్యమే మహాబలం అని మరోసారి రుజువైందంటూ చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు షమీ హుస్సేన్ , యాకూబ్ అలీ, గులాంహుస్సేన్,రఫీ,నాబిద్ తదితరులు ఉన్నారు.