కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా: ఎమ్మెల్యే

కొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని, అసెంబ్లీలో మాట్లాడకుండా రచ్చ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను సుదీర్ఘంగా నడపడం కేవలం సమస్యలపై చర్చించేందుకు మాత్రమే అని అన్నారు. అన్ని సమస్యలపై చర్చకు సిఎం కెసిఆర్‌ అంగీకారం తెలిపినా కాంగ్రెస్రాజకయీ ఎజెండాతో పనిచేస్తోందని అన్నారు. ఇదిలావుంటే ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లానీరు నీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. అత్యంత వేగంగా మిషన్‌ భగీరథ నిర్మాణ పనులు నడుస్తున్నాయని అన్నారు. ఇప్పటికే మణుగూరు – అశ్వాపురం మండలాల సరిహద్దు రథంగుట్ట వద్ద జరుగుతున్న మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌, రా వాటర్‌, క్లీన్‌ వాటర్‌ ఎ/-లాంట్‌ పనులు, అశ్వాపురం మండల కుమ్మరిగూడెం వద్ద ఇన్‌టేక్‌వెల్‌

పనులు పూర్తి కావచ్చాయని అన్నారు. పినపాక నియోజకవర్గానికి 2018లోనే స్వచ్ఛమైన మంచినీరు ప్రతి ఇంటికీ సరఫరా చేయడం జరుగుతుందన్నారు.