కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం కాలేదు : హరీష్రావు
హైదరాబాద్: సకల జనుల సమ్మె తర్వాత ఉద్యోగులలో మార్పు వచ్చిందని, అయినా ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం కాలేదని తెరాసా ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం నగరంలోని కోఠిలో వైద్యవిధాన పరిషత్ ఆవరణలో 16వ వార్షికోత్సవ మహాసభను నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవుల ప్రాణ త్యాగాలు చేస్తుంటే సీమాంధ్ర నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఏ రాజకీయ నాయకుడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.



