కేఒసి ఉద్యోగులకు ఉత్పత్తి ప్రోత్సాహక బహుమతులు అందజేత

టేకులపల్లి, ఆగస్టు 8( జనం సాక్షి) : ఇల్లందు ఏరియా కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి కంటే 125 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు గాను ఉద్యోగులకు ఏరియా జియం ఎం.షాలేము రాజు ఆదేశాల మేరకు సోమవారం కోయగూడెం ఒసిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్వటు జియం బండి వెంకటయ్య ఆధ్వర్యంలో ఉత్పత్తి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయగూడెం ఓపెన్ కాస్ట్ ఉద్యోగులు కరోనా కష్టాలు ఎదుర్కొని 125 శాతం తో బొగ్గు ఉత్పత్తి చేయడానికి కృషి చేసి ఇల్లందు ఏరియా ను ప్రథమ స్థానంలో నిలుపడానికి కృషి చేశారని, అందుకు గాను గుర్తింపు సంఘం అభ్యర్ధన మేరకు ప్రతి ఉద్యోగికి ఒక బహుమతి ఇవ్వాలని నిర్ణయం లో భాగంగా ఈ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్ఫూర్తితో ఏరియా కు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మల్లారపు మల్లయ్య, ఇంచార్జ్ మేనేజర్ కె.సత్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివశంకర్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీహరి గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్, బ్రాంచ్ కార్యదర్శి సండ్రా వెంకటేశ్వర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.