కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్దారణ
ధర్మపురి: మండలంలోని దొంతాపూర్ గ్రామంలో LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో M.N.J క్యాన్సర్ ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు మరియు వైద్య శిబిరం కార్యక్రమానికి ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,యంపిపి చిట్టి బాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్ పాల్గొన్నారు.
ఈ శిబిరంలో ఆరెపల్లి, తీగలధర్మారం, జైన దోనూర్, దొంతాపూర్, కొస్నూర్ పల్లె గ్రామాల నుంచి ప్రజలు పలు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది..
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..
క్యాన్సర్ నిర్దారణ పరీక్షలతో బాటు ఇలాంటి మారుమూల గ్రామాల్లో ఉచిత హెల్త్ క్యాంపులను నిర్వహించటం చాలా గొప్ప విషయమన్నారు.
మంగళవారం నిర్వహించే హెల్త్ క్యాంపు ద్వారా MNJ క్యాన్సర్ హాస్పిటల్ వారి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ద్వారా క్యాన్సర్ రోగులను తొలిదశలో గుర్తించడం వల్ల రోగులను ప్రాణాపాయం నుండి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
కార్పోరేట్ ఆసుపత్రులలో మాత్రమే లభించే వైద్య పరీక్షల ఒక బస్సు ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బందితో గ్రామస్థాయి ప్రజలకు అందుబాటులో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ కు గ్రామాల ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామాల్లో మహిళలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కుటుంబం, భర్త, పిల్లల కోసం, మరియు అలాగే ఆర్థిక ఇబ్బందులు,పని ఒత్తిడితో
వ్యాధులను నిర్లక్యం చేస్తున్నారు. వారి తెలువకుండానే అనేక వ్యాధులకు గురికావడం జరుగుతుంది, ఈ విషయం తెలుసుకునే సమయానికి ఆరోగ్యం విషమించడం జరుగుతుంది. చికిత్స చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు, మహిళలు తమ ఆరోగ్యాన్ని అశ్రద్ద చేయకూడదని అన్నారు,అందుకే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,ధర్మపురి నియోజకవర్గంలో మహిళల ఆరోగ్యం కొరకు తమ ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ద్వారా తన సతీమణి కొప్పుల స్నేహలత చైర్ పర్సన్ గా ట్రస్ట్ ఏర్పాటు చేసి, అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.ధర్మపురి మండలంలోని దొంతాపూర్ గ్రామంలో ఎల్.ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ మరియు MNJ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ సహకారంతో హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగిందని అన్నారు.
మంగళవారం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ, మన ప్రమేయం లేకుండా చాప క్రింది నీరులా ప్రవేశించే క్యాన్సర్, కిడ్ని, గుండె సంబంధిత వ్యాదులు మొదటిదశలోనే గుర్తించేలా అధునాతన వ్యాధి నిర్దారణ పరికరాలతో కూడిన MNJ క్యాన్సర్ హాస్పిటల్ వాహనంతో మీకు అందుబాటులో ఉంచడం జరిగిందని. హెల్త్ క్యాంపు ద్వారా అవసరమైన పరీక్షలను నిర్వహించి, మందులను అందించేలా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్య వంతులుగా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్యాంపు ద్వారా ఈ మహమ్మారిని ముందూగానే గుర్తించి చికిత్సను అందించడం జరుగుతుందని,రవాణ,ఆర్థిక బారంతో, వైద్య చికిత్సకు దూరమైన వారి కొరకు మారుమూల ప్రాంతాలలో సేవలను అందించడం జరుగుతుందని అన్నారు.మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం నందు MNJ నుండి 10 డాక్టర్లు, జగిత్యాల మరియు ధర్మపురి నుండి 6 డాక్టర్లు, ఈ శిబిరము నందౄ వైద్య సేవలు అందించారు, ఈ వైద్య శిబిరం లో 1039 మంది హాజరయ్యారు వీరికి వివిధ వైద్య పరీక్షించగా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. మరియు ఇందులో 232 మంది రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చేయడమైనది.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ రామచందర్ రావు, తెరాస పార్టీ అధ్యక్షుడు మొగిలి శేఖర్,పార్టీ మహిళ అధ్యక్షురాలు శ్యామల,
కరీంనగర్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు జాడి శ్రీనివాస్,ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు మామిడాల రవీందర్, గంగాధరి రాజేషం, నూతి మల్లన్న, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,ఆశా కార్యకర్తలు, ఆర్.ఎం.పి డాక్టర్లు,అంగన్ వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.