కోరుకొండ గ్రామాలపై గ్రీన్‌హంట్‌ దాడులు


ఆదివాసుల జీవనాధారమైన భూమి, వనరులను బహుళజాతి కంపెనీలకు ధారాదాత్తం చేస్తున్న పాలకులు,దాన్ని వ్యతిరేకిస్తున& వారిని తీవ్ర చిత్రహింసలకు, అణచివేతఅలకు గురి చేస్తున్నారంటున్నారు. కొర్ర జ్యోతి
ఆంధ్ర, ఒడిశా సరిహద్దులొని విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతి 33 గ్రామాలు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమానికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఐదు వేల జనాభాతో పచ్చని కొండల మధ్య చాలా ఆనందంగా కనిపిస్తున్న గ్రామాలు ఇవి. ఇక్కడ తెగల వారిగా చూస్తే పిటిజి (కువ్వి) గ్రామాలు పది, తెలుగు గ్రామాలు 21, ఒడియా గ్రామాలు 2 (భగత్‌, వాలిమిక్‌, పొర్జ, ఇడియా, కువ్వి, నూక దొర, ఇంద దొర తెగలు) ఉన్నాయి. ఆదివాసులకు ఆదాయం ప్రధానంగా అడవిలో అడ్డాకు, కొండ చీపురు, ఉసిరికాయ, తేనే, షికాయ, జిగురు వివిధ రకాల వాటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వీరి వ్యవసాయం కొండ పోడు పొల్లు, సామలు, కొండ కందులు,గొచ్చ కందులు,చిక్కుళ్లు, జొన్నలు, అల్పులు, పసుపు, ప్రధాన ఆదాయంగా ఉంది. దాన్యం 5-10 బస్తాలు (కొన్ని కుటుంబాలకు 20-25)పండిస్తారు. ఈ పంటలు కూడా సంవత్సరానికి నాలుగు నుండి ఐదు నెలల్లోపే మిగతా సమయం అడవిపై ఆధార పడాల్సిందే. అడవి నుండి ఆదివాసులను నేరుగా చూడలేం. అడవిపై ఆధార పడాల్సిందే. అడవి నండి ఆదివాసులను వేరు చేసినట్లుగా ఉంటుంది. 1980ల నుండి ఎపిఎఫ్‌డిసి అధికారులు ఈ ప్రాంతంలో సిల్వర్‌: ప్లాంటేషన్‌ పేరుతో వచ్చి కాఫి తోటల్ని నాటి స్థిరపడ్డారు. మొక్కల్ని నాటిన నుండి పెంపకం వరకు ఆదివాసుల శ్రమ ఉంది. 1879లో షెడూల్డ్‌ డిస్ట్రిక్స్‌ ఆక్ట్‌ వచ్చింది. ఈ ప్రాంతంలో గిరిజనేతరులకు భూ బదలాయిపంఏలను నిషేధిస్తూ 1917లో భూ అన్యాక్రాంతం నిషేధ చట్టం వచ్చింది. అదే చట్ట వనరులతో 1/59 గాను, ప్రస్తుత 1/70 గాను నేటికి కొససాగుతుంది. ఈ చట్టాలను కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుఒని పని చేయడం లేదు. బలపం ప్రాంతంలో 110 హెక్టార్ల కాఫీ తోటలని నాటించి ఆదివాసుల ద్వారా కూలీ చేయంచుకొని ఎపిఎఫ్‌డిఐ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. 1960 నుండి వివధ దఫాలుగా కూలీ రేట్ల కోసం కదిలిన ఆదివాసులు 2008లో మొదటిసారి మర్రిపాకల ఎస్టేట్‌ 66 హెక్టార్లు స్వాదీనం చేసుకున్నారు. ఇది చూపిన తోటి ఆదివాసులు 2010, డిసెంబర్‌ 6న బలపం పంచాయతీలోని 33 గ్రామాలు ఐక్యమై 110 హెక్టార్ల కాఫీ తోటల్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి కత్తి కట్టిన రాష్ట్ర ప్రభుత్వం మంగ గిరిజనులపై కేసులు పెట్టి వేధిస్తుంది. 2010 డిసెంబర్‌ చివరన కోరుకొండ గ్రామానికి చెందిన గెమ్మల చిట్టిబాబు, మత్య్స రాజులను (వారపు సంతకు వెళ్లి వస్తున్న వారిని) పట్టుకొని మూడు నెలలు జలులో బంధించి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశారు. అదే గ్రామానికి చెందిన తల్లే ఆనందరావుని పట్టుకొని చెట్టుకు వేళ్లాడదీసి తీవ్రమైన హింసలకు గురి చేసి మావోయిస్టుల జాడ చెప్పాలంటూ వేధించారు. అదే సమయంలో వేట నిమత్తం వెళ్లిన తోకపాడు గ్రామలస్తులపై 70 రౌండ్లు ఫైరింగ్‌ చేశారు. ఈ దాడి నుంచి గ్రామస్తులు తప్పించుకున్నారు. ఇక 2011 జనవరి నుండి గ్రామా లపై ఎపిఎఫ్‌డిసి ఆధికారులు, పోలీసులు కలిసి దాడులు చేస్తున్నారు.ప 2011 ఫిబ్రవరి 2న రాళ్లగెడ్డ గ్రామంపై ఎపిఎఫ్‌డిసి అధికారులు, పోలీసులు దాడి చేసి 195 కిలోల కాఫీ పిక్కల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరవై నాలుగు మంది గిరిజన యువకుల్ని మావోయిస్టు పార్టీ ఆర్క్‌వడ్‌ మిలిషియా సభ్యులుగా బూటకపు సరెండర్స్‌ చూపించారు. 2011 జూలై 25న కోరుకొండ ఇటిక బెడ్డల్‌ గ్రామాలపై వందల మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు, తోడేళ్ల గుంపు మేకల మందపై పడ్డట్టు పడి ఆరుగు రు గిరిజనులను రాత్రికి రాత్రే చింతపల్లి ఎఎన్‌పి ఆఫీస్‌కు తీసుకుపోయా రు.జ తెల్లవారి వీరికి మద్దతుగా 33 గ్రామాలకు చెందిన వెయ్యి మంది గిరిజనులు (తమ్మగుల, కాడిమిసార, అన్నవరం, లొత్తుగెడ్డ, పంచాయితీల వారు) స్ధానిక అన్నవరం పోలీసు స్టేషన్‌, చింతపల్లి ఎఎప్‌పి ఆఫీస్‌ని ఒకే సమయంలో ముట్టడించారు. ఆదివాసు ల ఆగ్రహాన్ని చవిచూసిన పోలీసులు ఏ కేసు లేకుండానే నిర్భందించిన వారిని విడిచిపెట్టారు. 2011 నుండి 2012 ఫిబ్రవరి 14 వరకు సాయుధ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 14 రాత్రి రాళ్లగెడ్డ గ్రామంపై మూడు వందల మంది పోలీసులు దాడి చేసి మహిళలు, పిల్లలు అని చూడకుండా కర్రలతో చితకబాదారు. మూడు పొగబాంబులు, ఐదు రౌండ్ల ఫైరింగ్‌ చేసి ఒక డిష్‌ టివిని, ఇంటి పెంకుల్ని ధ్వంసం చేసి సిందేరికార్ల అనే గ్రామ పెద్దని బలవంతంగా లాక్కుపోయారు. ఆదివాసులకు పోలీసులకు మధ్య మూడు గంటల పాలు ఘర్షణ జరిగింది.2012 మార్చ్‌ నుండి మే చివరి వరకు మూడు విడతలుగా కూంబింగ్‌కు వచ్చి పోలీసులు వారు తయారు చేసుకున్న ఇన్‌ఫార్మర్ల ద్వారా కాఫీ తోటల్ని (స్వాధీనం చేసుకున్న తోటల్ని) బుగ్గిపాలు చేశారు. గ్రామాలకి నోటీసులు పంపిస్తూ భయం సృష్టించారు. ఇదే అదునుగా చూసిన బూర్జువా పార్టీలు మార్చ్‌ 29న 75 మంది గిరిజనుల బూటకపు సరెండర్‌ నాటకం మరోసారి ముందుకు తెచ్చాయి. ఈ మూడు సంవత్సరాల నుండి వీరికి కావల్సింది 95 మందే అని చెపుతున్నారు. మరి ఏ సంబంధం లేని వారిని ఎందుకు పట్టుకున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం సరెండర్స్‌ చేయించారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? పోలీసుల దృష్టిలో 95 మందే ఉన్నారా? సంఖ్య తగ్గింది అనుకోవాలా? పెరిగింది అనుకోవాలా?
2012 మే 10న లువ్వసింగ్‌ గ్రామం వద్ద మావోయిస్టులక పోలసీఉలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరు వర్గాలకు ఏమీ కాలేదు. ఆ సమయంలో బంటంపాడు, ఎస్తాల్‌ గ్రామాలకు చెందిన రైతులు గుర్రాలని పతకపాక అడవికి వెళ్లిన వారిని పట్టుకొని కాల్చి చంపారు. మరో వ్యక్తి తృటిలో తప్పించుచకున్నారు. ఈ రెండు కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయి వీధిన పడ్డాయి. ఆ గ్రామం నుండి ఒక ఇంటిలో ఐదు వేల రూపాయలు, ఒక కాఫ్‌ తుపాకిని స్వాధీనం చేసుకొని చనిపోయిన వారి వద్ద పెట్టి మావోయిస్టు పార్టీ సభ్యులుగా చిత్రీకరించారు. న్యాయం కోసం ఈ కుటుంబాలు తిర గని ఆఫీసు లేదు. అయినా ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. పైగా ఈ రెండు కుటుంబాలక పాడేరు ఎఎస్‌పి నుండి బెదిరింపులు వస్తున్నాయి. వీరిని పట్టించుకొనే నాధుడే లేడు. ఈ ఘటనని కప్పి పెట్టుకోవడానికి, రాళ్లగెడ్డ గ్రామంలో జూన్‌మొ దటివారంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 2012, జూన్‌ 17 నుండి జూలై నుండి 8 వరకు ఎడతెరిపి లేకుండా వందల మంది స్పెషల్‌ పార్టీ, సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు కలిసి గ్రామాలపై దాడులు చేశారు. కుడుముల గ్రామంపై జూన్‌ 18 నుండి జూలై 2 వరకు నాలుగు వైపుల నుండి దాడుల చేనశారు. ఈ కూంబింగ్‌లో భాగంగానే ఎస్సార్‌ పైపులైన్‌ పనులు పూర్తి చేసుకొనే ప్రయత్నం చేసారు. ఈ ప్రాంత ప్రజలు ఎస్సార్‌ పైపులైన్‌ పనులన తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనుతిరిగిపోయారు. పంచాయితీల వారీగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తాం అని పంచాయతీ ఎద్లకు డిమాండ్‌ పత్రాలు పంపించారు. డిమాండ్స్‌ని ప్రజలు స్వీకరించలేదు. పోలసీఉల అండతో రాత్రిక రాత్రి వచ్చి పైపులైను పనుల్ని పూర్తి చేసుకొనిపోయారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కలసి పైపు వెల్డింగ్‌లను ఊడతీయకుండా కొంత కాలం సద్దుమణిగినట్టయింది. 2013 నుండ ఆ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. ఇలా మన దేవ పాలకు లు, ప్రజలకు సంబంధం లేని పనులు చేస్తూ, ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? 2011 డిసెంబర్‌ 25న కలాహకమిటీ (బాక్సైట్‌ సర్వే కమిటీ)కి అండగా అడుగు అడుగునా వందల మంది స్పెషల్‌ పార్టీ పోలీసులను పెట్టుకొని సర్వే కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. కలాహ కబపమిఈకి వ్యతాఇరేకంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న గిరిజనుల్ని పోలీసుల బెదిరించారు. చివరికి జెర్రిల పంచాయతీ గోపురం కొండ వద్ద (ఐదు వందల మంది) హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాకుండా గిరిజనులు సాంప్రదాయక ఆయు ధాలతో అడ్డుకున్నారు. దీంతో సర్వేని మధ్యంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు. మన్యం ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజాన్ని వెలికి తీయడంలో భాగంగానే మావోయిస్టు పార్టీ ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ దాడులు చేస్తోంది. దేశ మూలవాసులైన గిరిపుత్రులపై, ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల నుండి బాక్సైట్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న బలపం పంచాయితీ 33 గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా దాడులకు పూనుకుంది. బహుళజాతి కంపెనీల ప్రయోజనాలలో భాగంగానే 2013, జనవరి 26న వేట కోసం అడవికి వెళ్లిన గల్లలడండ గ్రామస్తులు ప్రాణాపాయం లేకుండా తప్పించుకున్నారు. కల్లు చెట్టుకు వెళ్లిన మరోనలుగురిని పట్టుకుని మావోయిస్టు పార్టీ ఆచూకి చెప్పమని తీవ్రమైన చిత్రహింసలు పెడుతూ ఇక రోజు మొత్తం అదుపులో పెట్టుకున్నారు. ఈ సంఘటనన ఏ బూర్జువా పార్టీ ఖండించిన పాపానపోలేదు. ఆ పార్టీలు కూడా బహుళజాతి కంపెనీలకు గ్రీన్‌హంట్‌: దాడులకు వంత పలుకుతున్నాయి. ఈ పంచాయితీ 33 గ్రామాలపై జరుగుతున్న దాడుల గురించి బయ ట ఉన్న ప్రజాస్వామికవా దులు తెలుసుకొని అవకాశాలు చాలా తక్కువ ఇప్పటికైనా నిర్బందంలో ఉన్న ఈ ప్రాంతాలను తిరిగి గ్రీన్‌హంట్‌ దాడుల వివరాలు, గిరిజనుల స్థితిగతులను తెలుసుకొని బయటి ప్రపం చానికి తెలియజేయాలి. ఈ పంచాయతీ గిరిజనులకు అండగా నిలవాలి.