గాంధీజీ సిద్దాంతాలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:రాజేందర్ రెడ్డి
వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 20 :గాంధీజీ సిద్దాంతాలు,ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల తెలంగాణ,ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి,కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ఆధ్వర్యంలో 2022 ఉత్తమ ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయ వజ్రోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రతిభ కనబరిచిన 36 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానం చేసి మెమొంటో అందజేశారు.అంతకు ముందు గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలకులను భారతదేశం విడిచి పెట్టాలని డిమాండ్ చేశారని సహాయ నిరాకరణ దేశ ప్రజలకు పిలుపునిచ్చారన్నారు.మహాత్ముని పిలుపుకు ప్రతిస్పందనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నారు.జాతిపిత అడుగుజాడలను అనుసరించే సమయంలో సత్యం అహింస సూత్రాలకు తాము అంకితం అవుతామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేశారని అన్నారు.ఎంపిపి నూతి రమేష్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి మార్గం చూపుతూ విద్యను బోధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కిలకమన్నారు.వారిని సన్మానించి గౌరవించడం మన బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి స్థానిక సర్పంచ్ మూల లలితా శ్రీనివాస్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గ్యాన్ ప్రతిష్టాన్ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి జిల్లా స్పోట్స్ అధికారి ధనంజయ మండల అధ్యక్షులు పాలకుర్ల వెంకటేశం,వాకిటి రాంరెడ్డి,కాసుల వెంకన్న,సాయిని యాదగిరి,పబ్బు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు