గిరిజనులకు రిజర్వేషన్ 10% పెంచినందుకు హర్షం

టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి,సెప్టెంబర్ 18( జనం సాక్షి ): గిరిజనులకు ఆరు శాతం నుండి 10% రిజర్వేషన్ పెంచినందుకు టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్ హర్షం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలిపారు . శనివారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కొమరం భీమ్ ఆదివాసి భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గిరిజనులకు వారి యొక్క జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్ పెంచుతున్నట్టు,ఆ రిజర్వేషన్ జీవోను వారం రోజుల్లో విడుదల చేయనున్నట్టు,అదే విధంగా భూమిలేని నిరుపేద గిరిజనులకు గిరిజన బంధు ఇవ్వనునట్టు ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టి.పి.టి.ఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ , టేకులపల్లి మండల శాఖ హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వాసం భాస్కరరావు,మూడు రమణ తెలిపారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లో ఈ జీవో విడుదల చేస్తారని మేము ఆశిస్తున్నామని,అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం 100% ఉద్యోగ నియామకానికి సంబంధించిన జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించి గాని దాని స్థానంలో 100% ఉద్యోగ నియామకాలు గిరిజన యువతి, యువకులకు కల్పిస్తూ మరొక జీవో నైనా విడుదల చేసి గిరిజనులకు, గిరిజన యువతి ,యువకులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. గిరిజన సంక్షేమ శాఖలోని కన్వర్టెడ్ ఆశ