గుగులోత్ కస్నా నాయక్ మృతదేహాన్ని ఘన నివాళులర్పించిన ప్రముఖులు
డోర్నకల్ సెప్టెంబర్-18 జనం సాక్షి
డోర్నకల్ మండలం హున్య తండా గ్రామపరిధిలోని రాము తండా కు చెందిన గొల్లచెర్ల ఎంపిటిసి భూక్య శ్రీనివాస్ నాయక్ మామ గుగులోత్ కస్నా అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. ఆదివారం వారి పార్థివదేహాన్ని ఘన నివాళులు అర్పించిన,స్వగ్రామం రాముతండా లో కుటుంబ సభ్యులు గూగులోత్ రమేష్, గుగులోత్ వీరన్న, స్థానిక సర్పంచ్ గుగులోత్ దేవి శంకర్ నాయక్ లను పరామర్శించి,
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు.వారి ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. అనంతరం కళాకారులు బృందంచే వారి అంతిమయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. నివాళులు అర్పించిన వారిలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కళ్ళెపు సతీష్ కుమార్ గౌడ్,మేకపోతుల శ్రీనివాస్ గౌడ్,మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి,మండల అధికార ప్రతినిధి భూక్య యువరాజ్ నాయక్,మాజీ ఎంపీటీసీ బాణోత్ శంకర్ నాయక్,బాణోత్ దేవ్సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ గంధంసిరి ఉపేందర్,బొంపెల్లి శ్రీను,హున్యతాండా గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య శ్రీను,వార్డు మెంబర్లు డిజె శ్రీనివాస్,ధరావత్ సీతారాం,భూక్య కవితమంగిలాల్, మండల సోషల్ మీడియా బానోత్ అర్జున్,భూక్య శ్రీను బాణోత్ కోబల్,మోతిలాల్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.