గోదావరి తీరంలో కార్తీక శోభ
భద్రాచలం,నవంబర్6(జనంసాక్షి): కార్తీకమాసం సోమవారంతో భద్రాద్రి గోదావరి తీరం కిటకిటలాడింది. ఉదయాన్నే భక్తులు వేలాదిగా తరలివచ్చి పవిత్ర గోదావరి స్నానాలు చేశారు. పుణ్యస్నానాలు చేసి రాములవారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలగించారు గోదావరికి హారతులు ఇచ్చారు. సహస్ర దీపారాధన, నామ సంకీర్తనం నిర్వహించారు. మహిళలు విరవివిగా పాల్గొన్నారు. రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీపారాధన కార్యక్రమంలో భాగంగా ఓంకారం, శివలింగం ఆకారంలో సుమారు పదివేల దీపాలను వెలిగించారు. హారతిని సమర్పించిన అనంతరం వందలాది మంది మహిళలు దీపాలను వెలిగించారు. శివనామస్మరణలతో తీరం మారుమోగింది.