గోపా ఆధ్వర్యంలోఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవవం…

హన్మకొండ బ్యూరో చీఫ్ 17సెప్టెంబర్ జనంసాక్షి
శనివారం రోజున తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హంటర్ రోడ్డులో గల గౌడ హాస్టల్ భవనం నందు జాతీయ పతాకం ఎగరవేసిన గోపా జిల్లా అధ్యక్షులు డా.చిర్ర రాజు గౌడ్ అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, చిర్ర రాజు  మాట్లాడుతూ రాజరిక నిజాం పరిపాలన అంతమై ప్రజాస్వామ్య పరిపాలన సెప్టెంబర్ 17 తారీకు 1948 రోజున భారత యూనియన్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో సైనిక చర్య తో హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం లొంగిపోయి భారతదేశంలో విలీనం చేసిన రోజు, భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రజలకు మాత్రం 13 నెలల 17 రోజుల తర్వాత సెప్టెంబర్ 17 1948 నాడు  నిజాం నుండి విముక్తి అయ్యి బానిస బతుకుల నుండి స్వేచ్ఛ వాయువులు అయిన తెలంగాణ ప్రజలు, నిజాంకు, రజాకార్ల లీడర్ కాసిం రజ్వికి వ్యతిరేకంగా ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బంధకి, కొమరం భీమ్, బత్తిని మొగులయ్య గౌడ్  పోరాటాల ఫలితమే ఈరోజు మనము స్వేచ్ఛ జీవిస్తున్నామంటే ఈ అమరుల త్యాగాల ఫలితమే ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలనలో కాసిం రాజ్వి రజాకార్ల సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించి నేలకొరిగిన వీరులందరికీ పేరు పేరునా
అమరవీరులకు జోహార్లు తెలియజేస్తున్నామని వారు అన్నారు. కార్యక్రమంలో గోపా జిల్లా అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్ గౌడ్, జిల్లా కోశాధికారి చిర్ర ఉపేందర్ గౌడ్, సహాయ కార్యదర్శి పెరుమాండ్ల అనిల్ గౌడ్, బత్తిని మొగలియ్యగౌడ్ ఫౌండేషన్ అధ్యక్షులు రమేష్ గౌడ్, కార్యదర్శి కునూరు రంజిత్ గౌడ్,  సెక్రటరీ డాక్టర్ తండు నాగయ్య గౌడ్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ రమేష్ గౌడ్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఏరుకొండ రమేష్ గౌడ్, అశోక్ గౌడ్, భాను ప్రకాష్ గౌడ్, గుర్రం వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, జితేందర్, కృష్ణ తదితరులు ఈ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.