*గ్రామంలోని అన్ని కులాల వారు కలిసి చేసుకునే ఒకే ఒక్క పండగ బొడ్రాయి పండగ*
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)
మేళ్లచెరువు మండలం కప్పలకు౦టతండా పరిధిలోని (శివబాలాజీ తండా) గ్రామంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవం సోమవారం తండా ప్రజల ఆనందోత్సాహాల నడుమ జరిగింది
ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు బొడ్రాయి ప్రతిష్ట మరియు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహోత్సవ వేడుకలో ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు పిల్లుట్ల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ వేడుకలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ పిల్లుట్ల రఘుకి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ…
గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు కలిసి చేసుకునే ఒకే ఒక్క పండగ బొడ్రాయి పండగని బొడ్రాయి పండగ రోజు ఆడపడచులందరితో కలిసి చేసుకునే పండుగ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ ఓజో ఫౌండేషన్ ఇన్చార్జి కుక్కల వెంకన్న మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ఓజో ఫౌండేషన్ సభ్యుడు భూక్య గోపి నాయక్, గ్రామ పెద్దలు
నాగేశ్వరరావుా, బాలాజీ ,తిరుపతి, భాస్కర్ ,వెంకటేశ్వర్లు ,కృష్ణ ,నాగు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు