గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…

ఫోటో :- జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్న దృశ్యం…

రుద్రూర్ (జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి భాజా భజంత్రిలతో ఊరేగింపుగా వెళ్ళి ఇంటింటికి జాతీయ పథకాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా జాతీయ పతాకాన్ని ఇంటి పై ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముజీబ్, ఎంపిడివో బాల గంగాధర్, ఎంపివో సాయిలు,
తెరాస పార్టీ సీనియర్ అక్కపల్లి నాగేందర్, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, సోసైటీ చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ విట్టల్, ఎస్సై ఆనంద్ సాగర్, , అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.