ఘనంగా రాఖీ పండుగ వేడుకలు
పెద్దవంగర ఆగస్టు 12(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఘనత కేసిఆర్ ప్రభుత్వందని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి తెలిపారు
శుక్రవారం చిట్యాల గ్రామంలో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో పిల్లలతో కలిసి రక్ష బంధన్ పాల్గొన్నారు.పిల్లలకు రాఖీలు కట్టి,తరువాత అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్ల కు, గ్రామ మండల ప్రజలకు,ప్రజాప్రతినిధులకు, అధికారులు,మహిళలకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మహిళలతో కలిసి కేసీఆర్ మరియు మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు రాఖీలు కట్టారు. అంగన్వాడి సెంటర్-4 బిల్డింగ్ పై త్రివర్ణ పతాకం జెండా కట్టించారు.
ఈ కార్యక్రమంలో ఇచ్డ్స్ సూపర్వైజర్ కవిత, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రామచంద్ర శర్మ ,మండల కో ఆప్షన్ నెంబర్ ఎండి ముజీబుద్దీన్, అంగన్వాడీ టీచర్లు పాక దుర్గ,పులుగుజ్జా రాజేశ్వరి, ఈదురు శోభ,బానోత్ చంద్రకళ,మహిళా సంఘాల నాయకులు కొయ్యేడి ఉమ, గొట్టిముక్కుల శోభ, కడునూరి ఉపేంద్ర, మండల యూత్ నాయకులు పులుగుజ్జా శంతాన్ , ఈదురు మధు, తెరాస నాయకులు ఎడ్ల చిరంజీవి, గుండగని లక్ష్మి, ఈదురు రమ్య,శ్వేతా,కావ్య, ఇమ్మడి నవ్య,పాలవెల్లి అమృత, అన్నబత్తుల ఉష, ఈదురు అనూష,ఈదురు శృతి, మహిళాలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు
