చంచల్‌గూడ జైలుకు 14 మంది తరలించిన పోలీసులు

చంచల్‌గూడ, హైదరాబాద్‌ : కాకినాడలో తీర ప్రాంత భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్న 14 మంది శ్రీలంక జాలర్లను కాకినాడ మెరైస్‌ పోలీసులు ఈ ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనుమతులు లేకుండా భారత సముద్ర జలాల్లో చేపల వేటను కొనసాగించినందుకు శ్రీలంక జాలర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ 14 మందితో చంచల్‌గూడ జైల్లో విదేశీ ఖైదీల సంఖ్య 43కి చేరింది. వీరిలో 25 మంది శ్రీలంక జాలర్లే ఉన్నారు.