ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రపంచం చూపు మనవైపు..

` నిమిషాల్లో పాక్‌ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం
` మైన సైనిక శక్తిని ప్రపంచం గుర్తించింది
` ఉగ్రవాదం,నక్సలిజం నుంచి విముక్తి
` అంతరిక్షంలో త్రివరణ పతాకం ఎగరేసిన శుభాంశు శుక్లా
` పార్లమెంట్‌ ముందు మీడియాతో ప్రధాని మోడీ
న్యూఢల్లీి(జనంసాక్షి):స్వాతంత్యర్ర వచ్చినప్పటి నుంచి భారతదేశం ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ అన్నారు. నేడు నక్సలిజం, మావోయిజం ప్రభావం వేగంగా తగ్గుతోందని చెప్పారు. దేశ భద్రతా దళాలు ఉత్సాహంతో విజయం వైపు పయనిస్తున్నాయని, వందలాది జిల్లాలు నక్సలిజం ప్రభావం నుంచి విముక్తి పొందాయని ఆయన తెలిపారు. గతంలో రెడ్‌ కారిడార్‌గా పిలిచే ప్రాంతాలు ఇప్పుడు గ్రీన్‌ జోన్‌లుగా మారుతున్నాయని, ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని ఆయన అన్నారు. బాంబులు, తుపాకుల ముందు భారత రాజ్యాంగం విజయం సాధిస్తోందని ఆయన ఉద్ఘాటించారు. దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి ఆయన మాట్లాడారు. పార్లమెట్‌ సమావేశాలను పురస్కరించుకుని ఆయన పార్లమెంట్‌ ముందు విూడియాతో మాట్లాడారు. వర్షాకాలం సమావేశాలకు విూ అందరికీ స్వాగతం అని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా ఆయన అభివర్ణించారు. మోదీ తన ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న హింసాత్మక ఘటనల గురించి మాట్లాడారు. ప్రధాని మోదీ భారత సైనిక శక్తి గురించి మాట్లాడుతూ, దేశం సైనిక రంగంలో గొప్ప పురోగతి సాధిస్తోందని తెలిపారు. సైనిక రంగంలో పరిశోధన, తయారీ, మేక్‌ ఇన్‌ ఇండియా ఆయుధాల ఉత్పత్తి బలపడుతోందన్నారు. ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైన్యం 100 శాతం లక్ష్యాలను సాధించిందని, కేవలం 22 నిమిషాల్లోనే శుత్రువుల ఇళ్లలోకి వెళ్లి వారి స్థావరాలను నాశనం చేసిందని పేర్కొన్నారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగంలో భారతదేశం సాధిస్తున్న విజయాల గురించి మోదీ మాట్లాడారు. ఈ రంగంలో దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని, అంతరిక్ష రంగంలో భారత్‌ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకం ఎగిరిన సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్షణం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, పార్లమెంట్‌ లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఒకే సమయంలో ఈ విజయాన్ని కొనియాడాయని మోదీ అన్నారు. ఈ విజయాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో వాతావరణం చాలా బాగా అభివృద్ధి చెందుతోందన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధిని కూడా ప్రస్తావించారు. ఈ ఏడాది వర్షాకాలం వ్యవసాయానికి అనుకూలంగా ఉందని, నీటి నిల్వలు గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు- పెరిగాయని తెలిపారు. ఇది రైతుల ఆర్థిక వ్యవస్థ, గ్రావిూణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటు-ందని ఆయన చెప్పారు. ఈ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వర్షాకాల సమావేశాన్ని ప్రధాని మోదీ జాతీయ గర్వంతో నిండిన విజయోత్సవ సమావేశంగా అభివర్ణించారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర, ’ఆపరేషన్‌ సిందూర్‌ ’ గురించి ప్రధాని ప్రస్తావించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన దేశ సైనికుల సత్తా చూశాం. అందులో వందశాతం లక్ష్యాలను సాధించాం. కచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఈ ఆపరేషన్‌తో మేడిన్‌ ఇండియా సైనిక సామర్థ్యం, గొప్పతనం ఏంటో ప్రపంచం చూసింది. ఈ మధ్య కాలంలో నేను ఎవరిని కలిసినా మేడిన్‌ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడు తున్నారు. మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయమిది. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మోదీ వెల్లడిరచారు. ఆపరేషన్‌ సిందూర్‌పై మన ఎంపీలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటించి వివరించారని ప్రధాని గుర్తు చేశారు. పాక్‌ దుష్ట చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టారని అన్నారు. తుపాకులు, బాంబుల ముందు మన రాజ్యాంగం బలంగా నిలబడిరదని తెలిపారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని వేడుక చేసుకోవాలన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఐక్యత చాలా అవసరమని.. ఎంపీలు, రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు దేశానికి చాలా గర్వకారణంగా నిలవబోతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన మువ్వనన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణం. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తున్నాయని, ఇది రైతులకు లాభదాయకమని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధార పడ్డాయని తెలిపారు. ఈసారి పడిన వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయి. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామని.. ఐఎస్‌ఎస్‌ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణం అని అన్నారు. భారత సైనిక పాటవాలను ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూసాయి. పహల్గాం ఊచకోతను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయని, పాక్‌ నిజస్వరూపాన్ని ఎంపీల బృందం ప్రపంచ దేశాలకు వివరించిందన్నారు. పార్టీలకు అతీతంగా పలు పార్టీలు, పలు రాష్టాల్ర్ర ప్రతినిధులు దేశహితం కోసం పని చేశారు.. వివిధ దేశాల్లో పర్యటించి పాక్‌ ఉగ్రవాదంపై ఎంపీలు ప్రచారం చేసారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ది మూడో స్థానమని అన్నారు. 25 కోట్ల మందిని దారిద్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చామని మోడీ వ్యాఖ్యానించారు.