తొలిరోజే వాయిదాల పర్వం

` లోక్‌సభలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ట్రంప్‌ వ్యవహారంతోపాటు పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు
` రాజ్యసభలో నలుగురు కొత్త సభ్యుల ప్రమాణం
` పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ, రాజ్యసభ సమావేశమయ్యాయి. తొలుత పహల్గాం ఉగ్రదాడి, ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఉభయ సభలు నివాళులర్పించాయి. రాజ్యసభలో కొత్తగా ఎంపికైన నలుగురు ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అటు- లోక్‌సభలో విపక్షాలు నిరసనకు దిగాయి. ఆపరేషన్‌ సిందూర్‌’తో పాటు పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టాయి. అయితే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి, విూరు చర్చక్రమంలో వస్తే సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పీకర్‌ ప్రకటించారు. పోడియంలోకి రావడం, నిలబడి నినాదాలు చేయడం తగదని అన్నారు. వారి నినాదాల నడుమ స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రతిపక్ష ఎంపీలు నిరసన విరమించాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఆగస్టు 21 వరకు 21 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ సహా అనేక అంశాలపై ప్రశ్నల్ని సంధించడానికి విపక్షాలు మూకుమ్మడిగా సిద్ధమయ్యాయి. తాము లేవనెత్తే అంశాలపై ప్రధాని స్పందిం చాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, పార్లమెంటు- నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ’ఆపరేషన్‌ సిందూర్‌’ సహా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించాలి: ఖర్గే
వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ఇటీవలి భారత్‌-పాకిస్తాన్‌ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 22న జరిగిన పెహల్గామ్‌ దాడి గురించి మాట్లాడుతూ, ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగి నెలలు గడిచినా, ఆ ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేదు, వారి గురించి సమాచారం కూడా లేదన్నారు. మా పార్టీ మాత్రమే కాదు, అన్ని పార్టీలు దేశాన్ని బలోపేతం చేయడానికి, సైన్యానికి ధైర్యం నింపడానికి మద్దతు ఇస్తున్నట్లు- తెలిపారు. కానీ, ఇప్పుడు అసలు పెహల్గామ్‌ దాడి జరిగిన దాని గురించి స్పష్టమైన సమాచారం కావాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. ఇం-టె-లిజెన్స్‌ విషయంలో లోపం జరిగిందని లెప్టినెంట్‌ గవర్నర్‌ చెప్పారు. ఆ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రభుత్వం ప్రపంచానికి, భారత ప్రజలకు చెప్పింది. కానీ, ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగిందో సమాచారం ఇవ్వాలని ఖర్గే కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత్‌-పాకిస్తాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని 24 సార్లు పేర్కొన్నారని ఖర్గే గుర్తు చేశారు. ట్రంప్‌ ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? శాంతి ఒప్పందం జరిగిందా? ఒకవేళ జరిగితే, దాని వివరాలు ఏంటి? ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. దేశ ప్రజలకు, పార్లమెంటుకు సమాచారం అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో జాప్యం జరగడం, ఇం-టె-లిజెన్స్‌ వైఫల్యం గురించి ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మన సైన్యం ధైర్యంగా పోరాడుతోంది. కానీ, ఇటు-వంటి సంఘటనలు మన భద్రతా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని, అన్ని వివరాలనూ దేశ ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేత, రాజ్యసభలో లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌ జేపీ నడ్డా స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తుంది, ఏంటనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

 

ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా
` వైద్యపరమైన కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి లేఖ
` వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. వైద్య పరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్‌ఖడ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2022 ఆగస్టులో ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.‘‘ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్యుల సలహాలను పాటించేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. నా పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటు సభ్యులందరికీ కృతజ్ఞతలు. వారి నుంచి లభించిన అమూల్యమైన సహకారం, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పదవీకాలంలో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. అనేక అనుభవాలను మూటగట్టుకున్నాను. ఈ పరివర్తనాత్మక సమయంలో ఉపరాష్ట్రపతిగా.. దేశ ఆర్థిక పురోగతిని, అభివృద్ధిని గమనించే అవకాశం రావడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు సంతృప్తినిచ్చింది. ప్రపంచ వేదికపై భారత్‌ విజయాల పట్ల గర్విస్తున్నాను. దేశ ఉజ్వల భవిష్యత్తుపై అచంచలమైన విశ్వాసం ఉంది’’ అని ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఏకపక్షంగా సమావేశాలు
` ప్రతిపక్ష నేతగా కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
` లోక్‌సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు
` విపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపణ
న్యూఢల్లీి(జనంసాక్షి):లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు లోక్‌సభ సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అధికార పక్షం సభ్యలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రక్షణ మంత్రి, ప్రభుత్వం లోని ఇతర మంత్రులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి.. తనకు మాత్రం అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా లోక్‌సభలో మాట్లాడే హక్కు తనకు ఉన్నప్పటికీ.. వారు ఈ విధంగా చేయడం ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభలో చర్చలు మొదలవగానే ప్రధాని మోదీ అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విషయాల్లో తమకు అనుకూలంగా ఉండే కొత్త విధానాలను సృష్టించుకుంటోందని దుయ్యబట్టారు.పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ సమావేశమయిన అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌’తో పాటు- పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ లోక్‌సభ లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు నిరసనను విరమించాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో సభను కొంతసేపు వాయిదా వేశారు. రాజ్యసభలో చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా లోక్‌ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అలాగే, వాయిదా తీర్మానాలపై చర్చించాలని కోరారు. దానికి స్పీకర్‌ ఒప్పకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు లోక్‌ సభలో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో రెండుసార్లు లోక్‌ సభ వాయిదా పడిరది. ఈ సందర్భంగా లోక్‌ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విూడియాతో మాట్లాడుతూ.. లోక్‌ సభలో విపక్షాలకు కూడా మాట్లాడ టానికి అవకాశం ఉండాలి అని డిమాండ్‌ చేశారు. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. మరోవైపు, వయనాడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేసారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ పై చర్చకు సిద్ధంగా ఉంటే, సభలో మాట్లాడటానికి మాకెందుకు అవకాశం ఇవ్వలేదు అని ప్రశ్నించింది. విపక్ష నేతగా రాహుల్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సింది అని పేర్కొన్నారు. చర్చ జరపడానికి సిద్ధంగా ఉంటే విపక్షాల గొంతు ఎందుకు నొక్కుతున్నారని ప్రియాంక గాంధీ అడిగారు.