చెలరేగిన చెన్నై
ముంబయిపై సూపర్ విజయం
రైనా, హస్సీ వీర విహారం
ఫౖౖైనల్లోకి ధోనిసేన
ఢిల్లీ : ఐపీఎల్-6లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మంగళవారం జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ హస్సీ వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడాడు. 58 బంతుల్లో 86 పరుగులు (10 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాట్స్‌మెన్ విజయ్ 20 బంతులు ఆడి 23 పరుగులు చేసి ఔటయ్యాడు. పొలార్డ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్ రైనా ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 82 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ 144 పరుగలకే ఆలౌటయ్యింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ స్మిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లో 68 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేసి ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టారే 7 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మార్కెల్ బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాట్స్‌మెన్లందరూ వెంట వెంటే వికెట్లు కోల్పోయారు. కార్తీక్ 11, శర్మ 8, పొలార్డ్ 24, రాయుడు 15, జాన్సన్ 6 పరుగులు చేయగా హర్భజన్ సింగ్, జాన్సన్, మలింగ, ఓజా డకౌట్ అయ్యారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3, బ్రావో 3, మోహిత్ శర్మ రెండు, మోర్కెల్, మోరిన్ తలో వికెట్ తీశారు. ముంబై బౌలర్లలో పొలార్డ్ ఒక వికెట్ మాత్రమే తీశాడు.