చోటు దక్కింది..
ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్
కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో విజయం
హైదరాబాద్ :
ఐపీఎల్-6లో సన్‌రైజర్స్ జట్టు ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంది. కీలక మ్యాచ్‌ల్లో జట్టు ఆటగాళ్లందరూ సమష్టిగా ఆడి సత్తా చాటారు. ఆదివారం హైదరాబాద్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్ధేశించిన 131 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. దీంతో బెంగళూర్ ఆశలు గల్లంతయ్యాయి. మొదట సన్‌రైజర్స్ బౌలర్లు స్టెయిన్ 2, మిశ్రా ఒక వికెట్ పడగొట్టి కోల్‌కతాను కట్టడి చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 130 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ 49, కల్లిస్ 24 పరుగులతో రాణించారు. 131 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. పటేల్ 37 బంతుల్లో 47, శిఖర్ ధావన్ 35 బంతుల్లో 42 పరుగులు సాధించి విజయాన్ని అందించారు. ఆఖర్లో సామి చెలరేగి ఆడాడు. 12 బంతుల్లో 17 (2 సిక్స్‌లు) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ఇక్బాల్ అబ్దుల్లా 3, షామి అహ్మద్ ఒక వికెట్ తీశాడు.