జల సత్యాగ్రహం చేస్తామంటున్న కూదంకుళం ఆందోళన కారులు

కూదంకుళం:కూదంకుళం ఆందోళన మరింద ఉద్ధృతం కానుంది. ఆందోళనకారులు సముద్రంలోకి వెళ్లి జలసత్యాగ్రహం చేస్తామంటూ హెచ్చరించిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు అణువిద్యుత్‌ కేంద్రం పనిని తక్షణం నిలిపివేయాలని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కూడా ఈ రోజు విచారణకు రానుంది.