తూప్రాన్ గీతా స్కూల్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 13::
75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ” ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తూప్రాన్ గీతా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు ” వజ్రం ” ఆకారంలో కూర్చుని అద్బుత ప్రదర్శన చేశారు. మూడు రంగుల బెలూన్లను చేత బూని వజ్రోత్సవ వేడుకలకు సూచికగా ” వజ్రం ” ఆకారంలో కూర్చొని పాఠశాల మైదానంలో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్  రామాంజనేయులు పర్సన్ పి.ఉష , తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ , డైరెక్టర్ మరియు మున్సిపల్ కౌన్సిలర్ కొడిపాక నారాయణ గుప్త ప్రిన్సిపాల్ వెంకట కృష్ణారావు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ప్రేంరాజ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నార