తెగి పడిన విద్యుత్ వైర్లు – పట్టించుకోని శంకరపల్లి విద్యుత్ ట్రాన్స్కో అధికారులు..
శంకర్పల్లి ఆగస్టు 19 (జనం సాక్షి)
విద్యుత్ వైర్లు తెగిపడి మూడు రోజులు గడుస్తున్న వైర్లను బిగించాలని శంకర్పల్లి ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని చిన్నారెడ్డి గూడా గ్రామ రైతు గంగారాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోని ఆలంకాని గూడా గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామ మైన చిన్నారెడ్డి గూడ గ్రామ పరిధిలో సబ్ స్టేషన్ నుంచి పంట పొలాలకు వచ్చే విద్యుత్ వైరు తెగి పంట పొలాల పై పడింది. వైరు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బోర్లు నడవక పంట పొలాలు కూరగాయ తోటలు కళ్ళముందే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శంకర్పల్లి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు గంగారాం, అంతారపు నర్సింలు, సిహెచ్ శ్రీనివాస్, రమేష్ సింగ్, జగన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత ట్రాన్స్కో ఉన్నతాధికారుల స్పందించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకొని విద్యుత్ వైరు బిగించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.