Tuesday, 3 November 2026

ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు

ఆంధ్రప్రదేశ్ : ఈ నెల 19, 20న ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియర్ నిరసనలు చేపట్టనుంది. ఉద్యోగ భద్రత సర్క్యూలర్ యథావిధిగా అమలు చేయాలని, తమ డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు నిరసనకు దిగనున్నారు. సిబ్బంది ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని యూనియన్ సూచించింది. ఆర్టీసీ డీపోలు, వర్క్ షాపుల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది.