వాణిజ్య /రవాణా వాహన చోదకులకు ఉపశమనం కలిగించే కీలకమైన తీర్పు: సుప్రీంకోర్టు

 

ఢిల్లీబీ ఎల్ ఏం వి డ్రైవింగ్ లైసెన్స్ తో రవాణా వాహనాలను నడపవచ్చు అని వాహన చోదకులకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఉపశమనం కలగనుంది. తేలికపాటి వాహనాల ఎల్ఎంవి) డ్రైవింగ్ లైసెన్స్ తో గరిష్టంగా 7.5 టన్ ల బరువు మించని రవాణా వాహనాలను చోదకులు నడపవచ్చు అని తీర్పు ఇవ్వడం జరిగింది. మోటార్ వాహన చట్ట (ఎంవిఏ)ప్రకారం అధికారుల నుంచి అదనపు లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు ఆటోలు క్యాబులు నడిపేవారు ఎల్ఎంవి లైసెన్స్ తో 7,500 కిలోల బరువు కంటే తక్కువ ఉన్న వాణిజ వాహనాలను నడుపుకోవచ్చు అని తెలిపింది. అపాయకరమైన సరుకులు తీసుకెళ్లే వాహనాలకు ఇది వర్తించదని సూచించింది.

తాజావార్తలు