తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి: వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్
నేత. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. పార్టీలో కొత్తరక్తం ఎక్కించాలనే
ఉద్దేశంతోనే డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమించనున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి
జిల్లాల్లో చేపడుతున్న ఇందిరమ్మబాట పర్యటన తొలిరోజున డీసీసీ అధ్యక్షులు కచ్చితంగా
పాల్గొనాలన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరూ రాష్ట్రమంతా తిరిగితే పార్టీకి ప్రయోజనం కలుగదన్నారు.