తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 12th

ఇంతకు ముందున్న కవిత్వంలో వ్యవ స్థిత మైన భాషని, పద చిత్రాల్ని, ప్రతికల్ని వాటికి ఆపాదించిన కాల్పనికతని ముస్లిం కవులు ముక్క లు చేశారు. అందుకుగాను నేటివిటీతో కూడిన భాషని, తమవైన అభివ్యక్తుల్ని, తమ వృత్తులకు సంబందించిన పనితనం నుండి ప్రతీకల్ని పునరి ్లఖించడంలో మిగతా కవితోద్యమాలకంటే ముస్లిం కవితోద్యమంలో ప్రత్యేకతను సంతరించుకుంది. తమతమ సంప్రదాయాలకు, సంస్కృతతికి సంబం ధించిన ఉర్దూ, అరబ్బీ, అక్కడక్కడ పారశీక పదా లను ఉపయోగించి తమకు తెలియకుండానే సా మాజికపరమైన శిల్పం సాధించారు.
సెహరా, గ్యాస్‌ చౌసర్‌, ఫరిష్తా, ఖౌసెఖిజా, జాని మాజ్‌, ముబారక్‌, ఖిల్వాత్‌, ఫాస్లా, మర్ఫా, జల్వా, మిలాద్‌, అజాం, దస్తర్‌ వంటి ఎన్నోపదాలు కేవ లం ప్రయోగ వైచిత్రకోసమో, పదాల ఆర్భాపటం కోసమో స్వీకరించినవి కావు. స్వీకరించిన వస్తు చిత్రీకరణలో యివి నిజాయితీకోసం స్వీకరించిన వి. ఇవి కవిత్వానికి బలం, చేప తీసుకురావడమే కాక కవి మనోప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి అనుసంధానం కుదిరే శిల్పానికి సాద్యం కల్పించా యి. శిల్పపరంగా ముస్లిం కవిత్వం ఒక పెద్దమ లుపు. ఒక వైవిద్యమైన కుదుపు కూడ.
వస్తు శిల్పాలు పరస్పరాశ్రితాలు. అవిభాజ్యాలు. అవెప్పుడూ ఒకేలా వుండవు. ఉండాలని అనుకోవ డం పొరపాటు. వివిధ సందర్భాల నుగుణంగా మారే పరిస్థితి వానికి లేకపోలేదు. నిజానికి, వస్తు శిల్పాల విశ్లేషణబట్టి సామాజిక స్థితిగతుల్ని అంచ నా వేయవచ్చు. ఆధునిక కవిత్వానికి ఈ మాట మరీ చక్కగా అతుకుదుంది. వస్తువును తీర్చిదిద డంలోనూ, వ్యక్తీకరణ బలంగా రూపుదిద్దుకోవడం లోనూ కవి ప్రతిభ కనుగుణంగా శీల్పం ఏర్పడు తుంది. వస్తువులో బలమైన అంశాలున్నప్పటికి కవి విన్యాసం భాసత్వం కాకపోతే సమన్వయబ లం, భావప్రసారం దెబ్బతింటాయి. వస్తువు ఎంత ఆధునికమైన దానికి తగిన శిల్పాన్ని పోందలేనప్పు డు కవి ఉద్దేశ్యం పాఠకులకు అందకపోవచ్చు.
పోత పోసుకుంటున్న నా వ్యకిత్తం మీదికి
వింత వింత భయాల్ని ఉసిగొలిపి
నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి
సుడిగాలుల పాల్జేసింది చర్రిత ( పుట్టుమచ్చ – ఖాదర్‌ మొహియుద్దీన్‌) ః
పుట్టుకతోనే ఒక ‘ఫియర్‌ సైకొసిస్‌ ‘ గ్రిప్‌ లొకి తీసుకున్న ముస్లిం దుస్థితిని , అభద్రతని కవి ‘పర్సానిఫికేషన్‌’ ద్వారా కవిత్వం చేశాడు. దాంతో భావ ప్రతిమ ,భాష శిల్పంలో ప్రధాన భాగాల య్యాయి. శాస్త్రీయమైన వస్తు తత్వాన్ని అనేక విధాలుగా వ్యక్తీకరించడానికి యిక్కడ శిల్పం దొహదపడింది.
సామాజిక జీవితం నుండి దూరమైన ఆలొచనలు ,అనుభూతులు కవిలో ఎప్పుడూ ఏర్పడవు. అని సామాజిక పరివర్తనను అవసరమైన శిల్పాన్ని ప్రొ ది చేస్తాయి-దేశ దేశాలు పట్టుకు తిరుగుతున్నా ను.
అన్ని దేశాలు నావే అనుకుంటున్నానను
ఊరూరూ ఇల్లిల్లూ నాదినాదనే అనుకుంటున్నా ను
ఏ తుమ్మోదా నా చిరునామా చెప్పుదు……. ….
నే నెవ్వరికి అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరొటు వెళ్తారొ తెలిదు
(‘ నాకే జన్మభూమిలేదు’ జల్‌జలా-అఫ్సర్‌) (‘ నా కే జన్మభూమిలేదు’ జల్‌జలా-అఫ్సర్‌)
సాధారణ వాక్యాలుగా కన్పింపినప్పటికి ఎక్స్‌ప్రెష న్‌లో సమాజమైన భాషా శిల్పం కన్పిస్తుంది,. శి ల్పంలొనూ భాషలిలొనూ ప్రధానం .ఆ భాష కష్ట నిష్ఠూరాలకు కనుగుణమైనా వ్యక్తీకరణని, శిల్పా న్ని ఏర్పాటు చేసుకుంటుంది.శిల్పం సమాజంలో వచ్చే మార్పుని అందుకుంటుంది.శిల్పాం సమా జంలో వచ్చే మార్పుని అందుకుంటంది. అంటే ప్రతి చిన్న కదలిక వస్తువులొ భాగమవుతుంది. అ ది తన అభివృద్ధి క్రమంలో శిల్పాన్ని నిర్ణయించు కుంటుంది.అప్పుడు మూలాన్ని త్రొసి కేవలం విష యాన్ని వ్యక్తం చేయదు . శిల్పానుగుణంగా సమా జమైన భాషా శిల్పం .పరదాల పిరమిడ్లలో ప్రా ణం లేని మమ్మీలుగా చేసి
మమ్మల్ని మౌనమాంసాలుగా ఉత్పత్తి యంత్రాలు గా బతకమన్న
మీ సంప్రదాయాలలో సలామ్‌ .. ….
ఈ పరదా పంజారాన్నిప్పుడు నిలువునా చీలుసు న్నా
నన్ను కాఫిర్‌ వన్నా బాదలేదు ( ‘ ఖబర్దార్‌ ‘ జల్‌ జరా – షాజహన్‌’ )
పరదాసు పిరమడ్‌తో పొల్చడంవల్ల దాని అసౌక ర్యం ,ఇరుకు పై కవితలొ వ్యక్తమౌతోంది. ప్రతీ కల ద్వారా శిల్పాన్ని ఆవిష్కరించిన వైనం ఇందు లో చూడవచ్చు.
కొన్నేండ్ల ఖబ్జాదారుడు భూమి స్వంత హక్కుదారు డని చట్టాలు చెబుతున్నప్పుడు
వందల వేల సంవత్సరాల కాపురస్తుడు
ఈ నేలకు పరాయివాడెట్లా అవుతాడు?
( ‘చెమట చుక్కని చీల్చకండి’ ఇక ఊరు నిద్రపొ దు- హనీఫ్‌ )
ఇక్కడ శిల్పాన్ని ,వస్తువుని సమ్మితం చేసి తన దృక్పతాన్ని పాఠకుడి మనొ ఫలకంపై దృశ్య పరు స్తాడు హానిఫ్‌ అందువల్లే వస్తువును నిర్మలంగా ,నిష్కర్షగా చెప్పగలిగాడు.ఎంచుకున్న
వస్తు సారాన్ని, దాని చలనాన్ని వేగం చేయటానికి శిల్ప మిక్కడ దోహదపడింది. దీన్నిబట్టి వివిధ నిర్మాణాంశాల మధ్య ఏకసూత్రత సాధించే అం శంగా శిల్పాన్ని గుర్తించవచ్చు.
శిల్పం వస్తువు ననుసరించే ఉంటుంది. చాలా వరకు సామాజిక బాహ్యా స్వరూపాల్ని ఆశ్రయించి కూడ వుంటుంది. సమాజపరమైన వైరుధ్యాలు శిల్పంపై ప్రభావాన్ని చూపవచ్చు. అంటే సామా జిక సంబందాల్లో తీవ్రమైన మార్పు వచ్చినప్పుడ ల్లా శిల్పంలో కూడ మార్పు రావచ్చు. ఇటువంటి శిల్పంవల్లా కవిత్వం నినాదప్రాయంలా ద్యోతకమ వ్వచ్చు. అటువంటప్పుడు కవిత్వం పదాల దొంతర, వకృత్వం అనే అపనింద పొందే ప్రమా దం లేకపోలేదు.
శిల్ప మొప్పుడు కవికున్న ప్రతిభా సామర్థ్యాలపై ఆధారపడి వుంటుంది. ఈ దృష్టితో ఉద్యమ కవి త్వంలోని శిల్పాన్ని ఆధ్యయనం చేసినట్లయితే- స్రీవాదం కంటే దళిత వాదం, దళితవాదం కంటే ముస్లింవాదంలో శిల్పం గుణాత్మకంగా మార్పు పొందింది. సామాజిక శిల్ప స్వరూపంకోసం ఈ కవులు పడిన తపన ఆయా కవుల కవితా నిర్మా ణంలో స్పష్టమౌతోంది. డి క్లాసిఫికేషన్‌ ద్వారా కవి తా వ్యక్తిత్వం బహిర్గతం కాదన్నది ముస్లిం కవి త్వంలో శిల్ప నిర్మాణంలో తేలిపోయింది.
శిల్పం ఒక నిర్ధిష్ట సామాజిక ఉనికికి సాక్ష్యం. సామాజిక వాస్తవికత గాఢమయ్యేకొద్దీ కవి దృక్ప థం ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకొనేలా చేసింది. అంటే కవి ప్రాపంచిక శిల్పానికి సన్నిహితమయ్యా డు. అప్పుడే సామాజిక వాస్తవివతతో కూడిన సం కీర్ణంగా ఉన్న శిల్పం ఎదురవుతుంది. పైకి ఒకర కంగా కన్పించినా ఒక్కోక్కకవి ఒక్కోతరహా శిల్పా న్ని పాటించాడు. తన వస్తువుమీద పాఠకుడికి నమ్మకం కలగలడానికి తన అభిప్రాయాలను పాఠ కుడికి నచ్చచెప్పడానికి శిల్పాన్ని అత్యంత శ్రద్దగా ఉపయోగించుకున్నాడు. దీన్ని చక్కగా గర్తెరిగినవా రు ముస్లిం కవులు. అందువల్లే కొత్త వస్తువుతో ని ర్మాణాత్మకమైన శిల్పంతో ముస్లిం కవిత్వం ప్రారం భమైంది. ఖాజ ‘షరతు’ ‘ఫత్వా’ స్కైబాబ ‘రెహాల్‌’ ‘మార్పా’ భంవర్‌, అఫ్సర్‌ ‘అజాం’ గౌస్‌ మొహి యుద్దీన్‌ ‘జాల్వా’ ఆప్రీన్‌’….చమన్‌ వంటి కవిత లేన్నో ముస్లిం కవితా శిల్పానికి పుష్టిని చేకుర్చు తున్న కవితలలో కొన్ని
చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే ముస్లిం కవి త్వంలోని శిల్పం అన్ని ఉద్యమ కవిత్వాల్లోకెల్లా ఎంతో ప్రత్యేకమైనది.
-ఎస్‌.షమీఉల్లా
వక్రీకరణకు గురైన ‘ముస్లిమ్‌’ పాలకుల చరిత్ర
నిజాం చరిత్రకు చెదలు
ముస్లింల పాలనలోని తెలంగాళణ చరిత్ర అంటే చాలు ఒక నిచమైన, అమానుషమైన, అ మానవీయ, అస్కృశ్య అంశంగానే ఇప్పటకి ప్రచా రం చేస్నున్నారు. చాలామంది చరిత్రకారులు నెగ టీవ్‌ దృక్పథంలోనే ఈ చరిత్రను రికార్డు చేసు ్తన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, హిందూత్వ చరిత్రకారుల మధ్య ఒక్కోసారి పెద్ద తేడాయే కనిపించదు. అందరికీ ఒకే ఊతపదం ‘నిజాం నిరంకుశ పాలన’! వీరికి ‘నిజాం’ అనేది వంశ నామం అనే సోయి కూడా లేదు. ఒక్కర్ని విమర్శించే ఉద్దేశంతో రాసిన సమయంలో కూడా మొత్తం వంశాన్ని తూర్పాన పడుతున్నారు. ము స్లిమ్‌ పాలకుల చరిత్రకు జరిగిన అన్యాయమే తె లుగు వారు సృజించిన ఉర్దూ సాహిత్యానికి కూడా జరిగింది. ఈ విషయం ఇటు తెలుగు సాహిత్య చరిత్రలో రికార్డు కాలేదు. అటు ఉర్దూ చరిత్రలో నూ భాగం కాలేకపోయింది. అసఫ్‌ జాహిల చరి త్ర గురించి, వారు తెలంగాణాకు చేసిన సేవ గురించి సరైన సాక్ష్యాధారాలతో, నిష్పాక్షికంగా రికార్డు చేయాల్సిన అవసరముంది.
1724 నుంచి 1948 వరకు హైదరబాద్‌ రాజ్యా న్ని పాలించి ఏడుగురు ప్రభువుల్లో చివరి నిజామ్‌ మీర్‌ ఉస్మానలీఖాన్‌ పాలనలో చేసిన లేదా చేయని కార్యకకలాపాలకు అతన్ని మాత్రమే బాధ్యుణ్ణి చే యకుండా మొత్తం వంశంపై దుమ్మొత్తి పోయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. 1938 సత్యాగ్రహోద్యమం నుంచి 1948 రజాకార్‌ ఉద్యమం వరకు ఆస్మానలీ అనుసరించిన విధా నాలకు అతన్ని బాధ్యుణ్ణి చేస్తున్నట్లుగానే అంతక ముందు అతను అమలు చేసిన అబివృద్ది పనుల క్రెడిట్‌ కూడా ఆయనకే ఇవ్వాలి. కాని ఇవాళ అందుకు భిన్నంగా చరిత్రలో విషయాలు రికార్డవు తున్నాయి. ప్రతి అవలక్షణమూ, ప్రతి పెత్తందారీ తనమూ, ప్రతి అణచివేతా నిజాం పాలనకు సం బందించిన గుర్తుగా పేర్కోంటున్నారు. భారత యూనియన్‌లో భాగం కాకముందు తెలంగాణ లేదా హైదరాబాద్‌ రాజ్య చరిత్ర అంతా అంధకార మయమని, పీడకల అని అలవోకగా రాసేస్తు న్నారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమాన్ని తిరుగుబాట్లను ప్రశంసిస్తూనే, బ్రిటిష్‌ పాలనలోని అభివృద్దిని, ఉదారత్వాన్ని కీర్తించే జాతీయ చరిత్రకారులు మనకు కనిపి స్తారు. కాని, నిజాముల హయంలో జరిగిన వికా స ప్రయత్నాలు కానీ, అభివృద్ది కార్యక్రమాలుకానీ చరిత్రలుకానీ చరిత్రలోకి ఎక్కవు. 1940 కంటె ముందు తెలంగాణ ప్రజలు నిజాముల మీద చేసి న ఉద్యమాలు కూడ ఆ చరిత్రకు నోచుకోవు. ఇక్క డి నిజాము పైనా, నిజాము వ్యతిరేక ఉద్యమం పె ౖనా సమానంగా పాటించిన నిషేదమే
-వేములఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది….