ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు

` మా వద్ద ఆధారాలున్నాయి
` లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌
` బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు
` మేము అధికారంలోకి వచ్చాక దేనినీ వదలం
` అధికారులు రిటైర్‌ అయినా పట్టుకుని శిక్షిస్తాం
` కాంగ్రెస్‌ న్యాయసమీక్ష సదస్సులో రాహుల్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): మొన్నటిలోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వార్షిక న్యాయ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. భారత దేశంలో ఎన్నికల సంఘం న్యాయ సమ్మతంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలను రిగ్గింగ్‌ చేయవద్దు అని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని రాహుల్‌ తెలిపారు. ఆ రిగ్గింగ్‌కు చెందిన డేటా, డాక్యుమెంట్లు- తమ వద్ద ఉన్నాయన్నారు. దీన్ని మేం నిరూపిస్తామని, ఆ డేటా ఇప్పుడు ఉందని రాహుల్‌ పేర్కొన్నారు.ఓ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన అధ్యయనాన్ని ఆయన వెల్లడిరచారు. ఆ నియోజకవర్గంలో ఉన్న 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షల ఓట్లు నకిలీ అని పేర్కొన్నారు. అలా ఫ్రాడ్‌ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 15 లేదా 20 సీట్లు తగ్గి ఉంటే, అప్పుడు మోదీ ప్రధాని అయ్యేవారు కాదని రాహుల్‌ అన్నారు. ఇండియాలో ఎన్నికల సంఘం చచ్చిపోయిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు- గెలవలేదని, నాకు ఆశ్చర్యం వేసిందని, ఎప్పుడైనా ఎన్నికల అవకతవకల గురించి మాట్లాడితే ఆధారాలు అడుగుతున్నారని రాహుల్‌ అన్నారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ మార్పు కనిపించిందని, లోక్‌సభకు.. విధానసభకు ఎన్నికల జరిగిన సమయంలో కొత్తగా కోటి ఓటర్లు జత కలిశారని, దాంట్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి వెళ్లాయని, అందుకే తన వద్ద ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాని రాహుల్‌ పేర్కొన్నారు.ఈ క్రమంలో మరోమారు భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీమరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని అన్నారు. ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా తక్కువ మెజారిటీతో మూడోసారి ప్రధానిగా గెలుపొందారని అన్నారు. భాజపాకు ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలుపంచుకుందని ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందని.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పైనా అనుమానాలు ఉన్నాయని రాహుల్‌ అన్నారు.ఎన్నికల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని.. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ఎలా జరిగిందనే విషయాన్ని త్వరలోనే తాము ప్రజల ముందు నిరూపిస్తామని పేర్కొన్నారు. తాము బయటపెట్టే నిజంతో ఈసీ (ఊఈ) పునాదులు కదిలిపోతాయన్నారు. ఓట్ల కుంభకోణంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్‌ అధికారులు పదవీవిరమణ చేసినా కూడా వారిని వదలమని హెచ్చరించారు. భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన.. దాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని అన్నారు. కాగా ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిరచింది. అవన్నీ నిరాధార ఆరోపణలేనని.. రాహుల్‌ లాంటి వారు చేస్తోన్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదని తెలిపింది.

మోదీని గద్దెదించుతాం.. రాహుల్‌ను ప్రధానిని చేస్తాం
` ఆయన కోరుకుంటే 2009లోనే ఆ పదవి దక్కేది
` వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 150 సీట్లు దాటకుండా చూస్తాం
` దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి
` సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం
` దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌
` పదవులను త్యాగం చేసిన ఘనత సోనియాది
` 75 ఏళ్ల నిబంధన పెట్టినా పదవి వదలని నేత మోడీ
` కాంగ్రెస్‌ న్యాయ సదస్సులో సిఎం రేవంత్‌ రెడ్డి
న్యూఢల్లీి(జనంసాక్షి): దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యమని అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్యర్ర తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని.. భాజపా, భారత రాష్ట్ర సమితి, జేడీ, బీజేడీ, ఆర్‌జేడీ.. ఏ పార్టీ అయినా స్వాతంత్యర్ర తర్వాతే వచ్చాయని తెలిపారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి. ఎన్నికల్లో ఓడినా,గెలిచినా ప్రజల మధ్యే ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని,11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించ ట్లేదని అన్నారు. వక్రమార్గంలో ఉన్న నేతలను రెండు చెంపదెబ్బలు కొట్టయినా దారిలోకి తెచ్చేందకు కాంగ్రెస్‌ కృషి చేస్తోంది. మా పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్నారు. 140 ఏళ్ల క్రితం దేశ ప్రజల స్వాతంత్యర్ర కోసం కదం తొక్కింది. ఆంగ్లేయులను ఓడిరచింది. భారత్‌ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ అమరులయ్యారు. యూపీఏ-1 సమయంలో సోనియాగాంధీ ప్రధాని కావాలని అందరూ కోరారు. కానీ, ప్రధాని పదవిని ఆమె త్యాగం చేశారు. 2004లోనే రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి అయ్యేవారు. ఆయన కోరుకుంటే 2009లోనే ప్రధాని అయ్యేవారు. కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు పార్టీ సీనియర్‌ నేతలకు ఇచ్చారు. కార్యకర్తగానే ప్రజల కోసం రాహుల్‌గాంధీ పనిచేశారు. సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా పోరాడుతున్నారు. మరోవైపు నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా కుర్చీ వదలట్లేదు. 2001లో సీఎం అయిననప్పటి నుంచి ఆయన కుర్చీలోనే ఉన్నారు. భాజపా సంఫ్‌ు పరివార్‌ మోదీని తప్పించేందుకు ప్రయత్నించింది. కానీ అందుకు ఆయన రాజీ పడలేదు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని మోహన్‌ భగవత్‌ చెప్పారు. కానీ 75 ఏళ్లు దాటినా.. మోదీ అందుకు సిద్ధంగా లేదు. ఇదే నిబంధనతో అడ్వాణీ, మనోహర్‌ జోషిని తప్పించారు. మోదీని సీఎం పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజ్‌పేయీ, ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్‌ భాగవత్‌ ప్రయత్నించారు. ఆయన్ను తప్పించడం వారి వల్ల కాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ పోరాటం విజయవంతం కాబోతుందని అన్నారు. దేశంలో సామాజిక న్యాయం, దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని, రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించడంలేదని, దేశానికి మార్గదర్శనం కోసం మనుసింఫ్వీు నేతృత్వంలో సదస్సు నిర్వహించడం గొప్పవిషయమన్నారు. సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన చెబుతున్నా.. రాహుల్‌ గాంధీని భారత ప్రధానిని చేసి తీరుతామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గతంలో దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్‌ వచ్చిన రాహుల్‌ గాంధీ వదులుకున్నారని.. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది రాహుల్‌ గాంధీ దేశ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. మోడీని ప్రధాని గద్దె విూద నుంచి కిందకు దించడం ఒక్క రాహుల్‌ గాంధీకే సాధ్యమన్నారు. మోడీని తరిమికొట్టి భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని పేర్కొన్నారు. మోడీని ఓడిస్తాం.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామన్నారు. మాది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. పాకిస్థాన్‌ ను ఇందిరా గాంధీ రెండు ముక్కలు చేశారు. తీవ్రవాదంపై పోరాటం చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. 2004లోనే రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి అయ్యేవారు. ఆయన కోరుకుంటే 2009లోనే ప్రధాని అయ్యేవారు. కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు పార్టీ సీనియర్‌ నేతలకు ఇచ్చారు. కార్యకర్తగానే ప్రజల కోసం రాహుల్‌గాంధీ పనిచేశారు. సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా పోరాడుతున్నారు. మరోవైపు నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా కుర్చీ వదలట్లేదు. 2001లో సీఎం అయిననప్పటి నుంచి ఆయన కుర్చీలోనే ఉన్నారు. భాజపా సంఫ్‌ు పరివార్‌ మోదీని తప్పించేందుకు ప్రయత్నించింది. కానీ అందుకు ఆయన రాజీ పడలేదు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని మోహన్‌ భాగవత్‌ చెప్పారు. కానీ 75 ఏళ్లు దాటినా.. మోదీ అందుకు సిద్ధంగా లేదు. ఇదే నిబంధనతో అడ్వాణీ, మనోహర్‌ జోషిని తప్పించారు. మోదీని సీఎం పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజ్‌పేయీ, ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్‌ భాగవత్‌ ప్రయత్నించారు. ఆయన్ను తప్పించడం వారి వల్ల కాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ పోరాడతారు. భాజపాకు 150 సీట్లు దాటకుండా చూస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

.క్రీడా పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌
` క్రీడలపై సమగ్రవిధానం లేకపోవడం వల్లే యువత తప్పుదోవ
` చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
` హెచ్‌ఐసీసీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్‌ పాలసీని తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడదోవ పడుతు న్నారని, క్రీడలను ప్రోత్సహించక పోవడం వల్లే యువత డ్రగ్స్‌ తీసుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. శనివారం హెచ్‌ఐసీసీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌లో ’తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీ’ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంతో పోటీపడే మనం.. క్రీడల్లో వెనకబడి ఉండడం బాగాలేదన్నారు. భారత్‌కు బలమైన క్రీడా వేదిక కావాలని.. అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఫస్ట్‌ ఎడిషన్‌ ఆఫ్‌ తెలంగాణ స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌. డ్రగ్స్‌ పై ఉక్కుపాదం మోపుతున్నామని.. యువతకు దశ దిశా లేకపోవడం బాధాకరమని అన్నారు. వ్యసనాల రూపంలో మనవైపు వేగంగా ప్రమాదం దూసుకొస్తుందని అన్నారు. ఓ విధానం లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని.. అందుకే నూతన క్రీడావిధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని భావిస్తున్నామని అన్నారు. తెలంగాణ రైజింగ్‌ 2047 పై స్పోర్ట్స్‌ చాప్టర్‌ పెడతామని అన్నారు. 1956లో ఫుట్‌ బాల్‌ టీంలో మనవాళ్ళు 9 మంది ఉండేవారని.. క్రీడల్లో హైదరాబాద్‌ కు మంచి పేరు ఉండేదని అన్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించినవారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చదువుల్లోనే కాదు, క్రీడల్లోనూ రాణిస్తే ఉద్యోగం ఇస్తామని అన్నారు. గ్రావిూణ ప్రాంతంలో క్రీడా నైపుణ్యానికి కొదవ లేదని అన్నారు. ఇప్పుడు స్టేడియంలు ఫంక్షన్‌ హాల్స్‌ గా మారాయని అన్నారు. ఒలంపిక్స్‌ లో ఒక్క గోల్డ్‌ మెడల్‌ కూడా రాకపోవడం సిగ్గు అనిపిస్తోందని అన్నారు.మనకంటే చాలా చిన్న దేశాలు క్రీడల్లో రాణిస్తున్నాయని అన్నారు. ఇటీ-వల సౌత్‌ కొరియాను సందర్సించామని.. అక్కడ స్పోర్ట్స్‌ వర్సిటీలో చదివినోళ్లే గోల్డ్‌ మెడల్స్‌ కొట్టారని అన్నారు.చైతన్యానికి పోరాటానికి మారుపేరైన తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పోరాటం చేసిన యువత నేడు దశ దిశా లేకుండా.. ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణిస్తున్నారని అన్నారు. పోరాట స్ఫూర్తి, చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడల్లో రాణించాలని, దేశానికి గొప్ప పేరు తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్టాన్ర్రికి క్రీడావిధానం ఉండాలని, క్రీడా విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలని, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలని పబ్లిక్‌ ప్రైవేట్‌ ప్నార్టర్‌ షిప్‌ తో నూతన క్రీడా విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు.