వామ్మో.. నగరంలో వాన..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
నాలాలు పొంగి పొర్లడంతో ట్రాఫక్‌ జామ్‌
అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక
హైదరాబాద్‌ ,ఆగస్ట్‌4(ఆర్‌ఎన్‌ఎ): కొన్నిరోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి జల్లులకబురు చెప్పింది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వాన కురవటంతో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని ముందుగా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అనుకున్నట్లుగానే వర్షాలు రాష్ట్రం అంతటా విస్తరించాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం రైతులకు కాస్త ఊరటనిచ్చు అశంమని చెప్పవచ్చు. రంగారెడ్డి, వికారదాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్‌, జగిత్యాల, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, మంచిర్యాలు, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నారాయణపేట, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, వనపర్తి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం గరిష్టంగా గంటకు 40 కి.విూ కంటే తక్కువ (గాలులలో) ఉండగా.. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని తెలిపారు.
మరోవైపు హైదరాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం వుంది.
హైదరాబాద్‌ లో వాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన వాన నాన్‌ స్టాప్‌ గా కురుస్తూ నగరాన్ని ముంచేసింది. కుండపోత అనే పదం కూడా తక్కువే అన్నట్లుగా కురిసిన వానకు
నగరంలో ఎక్కడ చూసినా నీళ్లతో వాగులు, చెరువులను తలపించాయి. రోడ్లన్నీ నదులను గుర్తు చేశాయి. సుమారు గంటకు పైగా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లోమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ కురిసిన వర్షంలో సిటీలోనే సంపన్న ఏరియాగా పేరున్న జూబ్లీహిల్స్‌ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జడివాన కురిసినట్లుగా వర్షం దంచికొట్టడంతో జూబ్లీహిల్స్‌ లో 7.4 -ప వర్షపాతం నమోదైనట్లు- వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. గంటలోగా ఇంత వర్షపాతం నమోదవ్వడం చాలా కాలం తర్వాత నగర వాసులు చూస్తున్నారు. జూబ్లీహిల్స్‌ తర్వాత మెహిదీపట్నంలో 5.3 -ప వర్షం కురిసింది. ఆ తర్వాత శ్రీనగర్‌ కాలనీ లో 5 సెంటీ-విూటర్ల వాన నమోదైంది. ఆ తర్వాత వర్షపాతం వరుసగా బంజారాహిల్స్‌ 4.6, యూసఫ్‌ గూడా 3.9 , ఖైరతాబాద్‌ 3.6 , మైత్రివనం 3.4, కూకట్‌ పల్లి3, మెహిదీపట్నం 3 సెంటీ-విూటర్ల వర్షపాతం నమోందైంది. మరోవైపు రాజేంద్రనగర్‌, కాప్రా, చర్లపల్లి, గాంధీభవన్‌, అత్తాపూర్‌, ఫలక్నామా, మల్కాజిగిరి, మూసాపేట్‌, ఏఎస్‌ రావు నగర్‌, మాదాపూర్‌, మల్లపల్లి, గోషామహల్‌, ఆనంద్‌ బాగ్‌ ఏరియాల్లో 2 -ప వర్షం కురిసినట్లు- వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక భారీ వర్షం కారణంగా నగరవాసులు బయటికి రావద్దని సిటీ- ట్రాఫిక్‌ పోలీసులు, హైడ్రా అధికారులు సూచించారు. నాలాలు పొంగుతుండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జాం అవుతున్న కారణంగా.. రోడ్లపైకి వస్తే ట్రాఫిక్‌ లో ఇరుక్కుంటారని హెచ్చరించారు. వాన నిలిచే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ లో ఎన్నడూ లేనంత వాన కురుస్తోంది. దీంతో నగరంలో వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వరద కారణంగారోడ్లు వాగులు, నదులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగుతున్నాయి. పట్టగలే సాయంత్రం అయినట్లుగా మారిపోయింది పరిస్థితి. దీంతో పోలీసులు వాహనదారులకు, హైదరాబాదీలకు సూచనలు చేశారు. అదే విధంగా ఆఫీసుల్లో ఉన్న వాళ్లు వర్షం నిలిచే వరకు బయల్దేరవద్దని హెచ్చరించారు. భారీగా వరద పారుతుండటంతో రోడ్లపైన వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యే అవకాశం ఉండటంతో వర్షం కాస్త రిలీఫ్‌ ఇచ్చిన తర్వాతే బయలు దేరాలని సూచించారు పోలీసులు. సిటీ- మొత్తానికి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే చాన్స్‌ ఉందని.. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. నగరవాసులు ఏదైనా ప్రదామానికి గురైతే 100 కు డయల్‌ చేయాలని సూచించారు.