తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఈ పీర్లను లోహాలతో చేతి ఆకారంలో తయారు చేస్తారు. విగ్రహారా ధకులైన తెలుగోల్లు తాము న మ్మిన అతీతశక్తులను విగ్రహారూపంలోనే కాకుం డా రూపరహితమైన రాళ్లలోనూ, కోయ్యలో నూ, చెట్టులోనూ, చివరకు మట్టి కలశంలోనూ చూసు కుంటారు. పల్లెల్లో కొలిచే ఉప్పలమ్మ చేతి ఆకా రంలోనే ఉంటుంది. అందుకే కావచ్చు చేతి ఆకా రంలో ఉండే కర్బలా వీరుల స్మృతి చిహ్నలైన పీర్ల పైన పల్లెల్లోని తెలుగోల్లకు ఆరాధనాబావం ఏర్ప డింది.పీర్ల పండగ సందర్భంలో అఘర్‌ఖానాలో మజ్లీస్‌లు జరుగుతుంటాయి. ఈ సమావేశాల్లో మృతవీరుల వృత్తాంతాలను వివరిస్తూ ఉంటారు. ఈ మజ్లిస్‌లు మగవారికి, ఆడవారికి వేరు వేరుగా ఉంటాయి. మజీదుల్లో ప్రవేశం లేని స్త్రీలకు ఈ ప్రత్యేకమైన మజ్లీస్‌లో ప్రవేశ అర్హత ఉంది. కుల, మత ,వర్ణ, భేదం లేకుండా అఘర్‌ఖానాల్లో అంద రూ పాల్గోనవచ్చు పురాణ పఠనం వినే తెలుగోల్ల కు కర్భలా వీరగాధలను వినడం కూడ అబి óమా నంశమైంది. పీర్ల ఊరేగింపులో ముస్లింలతో సమానంగా తెలుగోల్లు కూడా పాల్గోంటారు. కొన్ని కొన్ని పల్లెల్లో ముస్లింలే తక్కువగా ఉంటా రు. తెలుగోల్లు ఎక్కువగా ఉంటారు. తెలుగోల్ల ఆచార సంప్రదాయల్లో ఊరేగింపులకు ప్రాధాన్య ముంది. పెళ్లిలోనూ, చావులోనూ, దేవతల ఉత్స వాల్లోనూ ఊరేగింపులు తప్పకుండా వుంటాయి. పీర్ల ఊరేగింపులో ముస్లింలు వీరుల కథలను చెప్పుకుంటూ, ఏడుస్తూ పీర్లతో ఊరేగుతారు. చివ రిరోజు పీర్లను ఊరిచివర నీళ్లలో కడిగి ఆర్తిగా గీతాలను గానం చేస్తూ ఊరి చివర చెరవులోకా నీ, బావిలో కానీ, కాలువలో కానీ వదిలేస్తారు. భగవంతునిపై తమకు ఉన్న భక్తిని నిరూపించడా నికి భక్తులు హింసించుకోవడం, శరీర అవయ వాలను నరుక్కోవడం తెలుగోల్ల ఆయా కులాల్లో  కూడా కనిపిస్తుంది. ఆచారాల ఉద్దేశా లు వేరైన ఆచరన మాత్రం ఇరువురిలో కనిపిస్తుంది. ఈ కారణమే తెలుగోల్లు పీర్ల ఊరేగింపులో పాల్గోన డానికి ఒక అంశమయ్యింది.

పీర్ల చావిడికి ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో పీర్లనెత్తుకుని నడవడం పండగలోని ముఖ్యాంశం. కర్భలా యుద్ద సమయంలో హుసేన్‌ తన పరివా రాన్ని శత్రువులు ముట్టడించకుండా ఉండటానికి చుట్టూరా అగ్నిగుండాల్లో నడవడం పల్లెలో గ్రామ దేవతల జాతర్లలో కనిపిస్తుంది. అంకాలమ్మ, పైళ మ్మ, నూకాలమ్మ, చింతాలమ్మ, పోలేరమ్మ, సత్తె మ్మ, ద్రౌపది లాంటి స్త్రీ దేవతల జాతర్లలోనే కా కుండా మల్లన్న, వీరభద్రుని జాతర్లలో కూడా అగ్నిగుండాలు తొక్కుతారు. రాయలసీమలోని ము స్లింలు ముఖ్యంగా  దూదేకుల వారు ఆటలమ్మ ఎల్లమ్మ దేవతలను కొలుస్తారు. వారి పండుగల్లో నిప్పుల గుండంలో నడుస్తారు. తమిళ దేశంలోని పల్లెల్లో ముస్లింలు తమ పిల్లలకు మశూచికం తగి లితే మరియమ్మ దేవతకు మొక్కుకొని దేవత ఉత్స వంలో మొక్కు తీర్చడానికి గుండంలో నడుస్తారు. ఈ ఆచారాల వల్ల తెలుగోల్లు ముస్లింలు అనే భేదం లేకుండా భగవంతునిపైన తమకుండే భక్తి ని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికే భక్తులు నిప్పుల గుండంలో నడుస్తారనే స్పష్టమవుతుంది.

నిప్పుల గుండంలో నడిచేవారు నియమనిష్టలతో ఉంటారు. తెలుగోల్లయినా, ముస్లింలైనా మంసా హారాన్ని వదిలి శాఖాహారాన్ని తింటారు. పండ్లు పలాలనే ఎక్కువగా తీసుకుంటారు.ఈ కారణాల న్నింటివల్ల ముస్లింల పీర్లపండగ ఆచారాల్లోని పొలికల వల్ల, ముస్లింల పీర్లపండగలో పాల్గోన డమే కాకుండా, ఆ పండగను తెలుగోల్లు తమ సంస్కృతీకరణం చేసుకుంటారు.పీర్ల పండగ మత పరమైన ముస్లింలది అనే భేదం లేకుండా, తమ పండగల్లో ఒక పండగగా బావించి అత్యుత్సా హంగా జరుపుకుంటారు.

తెలుగోల్లలో విషాదభరితమైన పండగలు లేవు. ముస్లింలు మొహర్రం కేవలం విషాదంగానే జరు పుకుంటే, తెలుగోల్లు మాత్రం వినోదం, ఉత్సా హం, ఉల్లాసం, విషాదం, భక్తిబావాలతో చేసుకుం టారు. ముస్లిం మత సంస్కృతిలోని మూలంశాల ను పాటిస్తూనే తెలుగోల్లు తమ ఆచార సంప్రదా యలకు అనుగునంగా పీర్ల పండగను మార్చుకు న్నారు.దసరా, దీపావళి, సంక్రాంతి, పండగలకు గ్రామ దేవతల పండగలకు ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి పిలుచుకున్నట్లే పీర్ల పండగకు కూడా తెలుగు, తమిళ ప్రాంతాల్లో తమవారిని పిలుచుకుంటారు. ఆడపడుచులకు ఒడిబియ్యం పోస్తారు. కొత్త బట్టలు కట్నంగా పెడతారు. పీర్ల పేర్లను కూడా తెలుగీకరణం చేస్తారు. ఆసయ్య పీర, ఊసయ్య పీర ఎవరి పేరు మీద వారి పీర్లను పిలుస్తారు.పలెటూల్లలో పీర్లపండుగను జరపడాని కి ముస్లింలు లేకుంటే పక్క ఊరినుండి పిలుచు కుంటారు. కొన్ని ప్రాంతాల్లో హిందువులే స్వయం గా పీర్ల పండగను జరిపించే సంఘటనలు కూడా ఉన్నాయి. తమిళనాడులోని తిరుచనాపల్లిలో పద ేళ్ల కింద ముత్తు కన్నప్ప అనే స్త్రీ మొహర్రం పండ గను తనే స్వయంగా నిర్వహించేది. అక్కడ మొహ ర్రం పండగను జరిపే మహ్మద్‌ చనిపోయిన తర్వా త ఆ బాద్యతను 75 సంవత్సరాల ముత్తు కన్నమ్మ తీసుకున్నది. ఆమె ఒకసారి అనారోగ్యంతో బాధప డుతుంటే ఇమామ్‌ హూసేన్‌ ఆరోగ్యన్ని బాగు చేస ినట్టు కల గన్నది. అప్పటినుండి ఆమె ఆరోగ్యం బాగైంది. హుసేన్‌ భక్తురాలైంది. తానే స్వయంగా ఉత్సవాలు నిర్వహించేది. ఆమెకు ఉర్దూ భాష వచ్చేది. అందుకే’ అల్‌విదా’ పాటలను కూడా బాగా పాడేది.

గ్రామాల్లో జరిగే పెళ్లిల్లలో, పండగల్లో, ఉత్స వాల్లో, గ్రామ దేవతల పండగల్లో అన్ని వృత్తుల వారు పాల్గోంటారు. తమ బాధ్యతలను, హక్కు లను నెరవేర్చుకుంటారు. పీర్ల పండగలో కూడా చాకలివారు పీర్ల కొట్టాడానికి సున్నం వేస్తారు. కంసాలి పీర్లను శుబ్రపరుస్తారు. ఎరుకలి దట్టీ లకు అవసరమయ్యే దారాన్ని పద్మశాలి ఇస్తారు. ఊరేగింపులో డప్పులను మాదిగలు వాయిస్తారు. పీర్ల పండగ చివరన చేసుకునే విందుకు కావల సిన బియ్యాన్ని ఊరి పటేల్‌ ఇస్తాడు. గౌడు కల్లు తో అందరీని తృప్తి పరుస్తాడు. పీర్లకు బలిగా ఇచ్చే మేకపోతును గొల్లలిస్తారు. విందులోని వం టలను మంగలి వండుతాడు, అందరికీ వడ్డి స్తాడు. ఇలా ఊళ్లోని అన్ని వృత్తులవారు పీర్లపం డగలో పాలు పంచుకుంటారు.కుల, మత, వర్గ బేదాలను మర్చిపోతారు.

పల్లెల్లో పీర్లను తురకదేవుడని పిలుస్తూనే తమ దేవుళ్లకు మొక్కుకునే మొక్కులను మొక్కుతుంటా రు. మొక్కులను తీరుస్తారు. పీర్లకున్న దట్టిలో కుడ కబెల్లం ముడి వేస్తారు. ఫాతిమా పీరుకు వడిబి య్యం పోస్తారు. పీర్లను చేయిస్తారు. పంజాలకు వెండిగొడుగులు, వెండి ఉయ్యాలలను చేయిస్తారు అలవా చుట్టూ మేకపోతును గానీ, గొర్రెను గానీ తిప్పి బలిస్తారు. అంతేకాకుండా కొందరు తమ పొలాల్లో గానీ, ఇంటి ముందు కానీ ముజావర్‌ చేత దర్గాలను ప్రతిష్ఠింప చేస్తారు. ఆ దర్గా దగ్గర నే పిల్లలకు పుట్టెంటుకలను తీస్తారు. విందులను చేసుకుంటారు. స్త్రీలు మాత్రం ముస్లింలలాగా దర్గా దగ్గర బొట్టు పెట్టుకోరు. తలమీద కొంగు వేసుకుంటారు. మొక్కుకుంటే పుట్టిన పిల్లలకు ఆసయ్య, మస్తానయ్య, ఖాసిం, ఊసయ్య అని పేర్లు పెట్టుకుంటారు.

తెలుగోల్లు మొక్కులను మొక్కుకోవడంలోనే కాకుండా తమ ఆచార సంప్రదాయాలను పీర్ల పండగలో ప్రదర్శిస్తారు. తెలంగాణలోని పల్లెల్లో పట్టణాల్లో బొనాల పండగను అతి వైభవంగా జరుపుకుంటారు. దేవతకు భోజనం అర్పించడమే కాక బోనాల పండగ, పసుపు, కుంకుమ, వేపాకు అలంకరించిన చిన్న మట్టికుండలో నైవేద్యాన్ని వండి వాద్వాలతో అమ్మవారి ముందు నివేది స్తారు. బోనాల పండగలాగే తెలంగాణలో మట్కీ అనే చిన్నకుండకు సబ్బి ఆకులు కట్టి దాంట్లో పా నకం పోస్తారు. దానిపైనుండే మట్టిమూతలో పెరుగన్నం, పులిహోర పెట్టి పీర్లకు నైవేద్యంగా సమర్పించి కొంత ఇంటికి తెచ్చుకుని పీర్ల తీర్థ మని పానకాన్నీ, నైవేద్యమని అన్నాన్నీ పంచి పెడతారు.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…